UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడేవారికి ఇది ముఖ్యమైన సమాచారం. చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేక..లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఆఫ్‌లైన్‌లో కూడా యూపీఐ లావాదేవీలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అంతా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ ఏ పేమెంట్ చేయాలన్నా యూపీఐ విధానంలో జరుగుతోంది. అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేక యూపీఐ పేమెంట్స్ ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. ఇది అతి పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఈ సమస్య ఇప్పుడు పరిష్కారమైపోయింది. 


నెట్వర్క్ తక్కువగా ఉన్నా సరే పేమెంట్ (UPI Payment without Internet) పూర్తి చేయవచ్చు ఇక. చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ఫోన్ తీసుకుని..*99# డయల్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి డయల్ చేసిన తరువాత బ్యాంక్‌ను ఎంపిక చేసుకోమంటూ పాప్‌అప్ ఒకటి వస్తుంది. బ్యాంక్‌ను ఎంచుకున్న తరువాత..జాబితా నుంచి బ్యాంక్ ఎక్కౌంట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మీ యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి..డెబిట్ కార్డు చివరి ఆరంకెలు నమోదు చేయండి. ఇప్పుడు మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ డేట్ నమోదు చేయాలి. యూపీఐ పిన్ ఆరంకెల్ని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు మరోసారి *99# డయల్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా ఆప్షన్స్ కన్పిస్తాయి. డబ్బులు పంపించాలనుకుంటే..1 నెంబర్ టైప్ చేయండి. రిసీవర్‌కు పంపించాల్సిన నగదు టైప్ చేసి పంపించండి.


ఇప్పుడు మీ యూపీఐ ఎక్కౌంట్‌తో ( UPI Payments) రిజిస్టరైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి పంపించండి. ఇప్పుడు అనుకున్న నగదు పంపించండి. పేమెంట్‌కు సంబంధించిన విషయాన్ని ఎంటర్ చేయండి. లావాదేవీని పూర్తి చేసేందుకు యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. ఇలా ఇంటర్నెట్ లేకుండా మీ యూపీఐ పేమెంట్ పూర్తవుతుంది. 


Also read: Whatsapp Tricks: క్వాలిటీ పోకుండా వాట్సప్‌తో ఫోటోలు పంపించడం ఎలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి