UPSC: త్రివిధ దళాల్లో చేరాలనుందా...అయితే ఈ జాబ్స్ మీ కోసమే
త్రివిధ దళాల్లో చేరాలని ఉందా..అయితే యూపీఎస్సీ నోటిఫికేషన్ ( upsc notification ) చూడండి ఓసారి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కోసం యూపీఎస్సీ వెలువరించిన నోటిఫికేషన్ లో ఒకటి కాదు రెండు కాదు...344 పోస్టులున్నాయి మరి.
త్రివిధ దళాల్లో చేరాలని ఉందా..అయితే యూపీఎస్సీ నోటిఫికేషన్ ( upsc notification ) చూడండి ఓసారి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కోసం యూపీఎస్సీ వెలువరించిన నోటిఫికేషన్ లో ఒకటి కాదు రెండు కాదు...344 పోస్టులున్నాయి మరి.
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ( Combined medical services ) ( CMS ) కింద మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఇటీవల యూపీఎస్సీ ఓ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను 344 పోస్టులతో విడుదల చేసింది. త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువతకు నిజంగా ఇది మంచి అవకాశం. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ( Combined defence services ) ( CDS ) లో భాగంగా విడుదల చేసిన ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5 సాయంత్రం ప్రారంభమైంది. ఆగస్టు 25 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ ( Upsc ) ప్రకటించింది. సీడీఎస్ పరీక్షల్ని యూపీఎస్సీ ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తుంటుంది. పూర్తి వివరాల కోసం www.upsc.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. Also read: CBSEలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
మొత్తం పోస్టులు 344
ఇండియన్ మిలట్రీ అకాడమీ, డెహ్రాడూన్ 100 పోస్టులు
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమల 26 పోస్టులు
ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ 32 పోస్టులు
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై ( పురుషులు ) 196 పోస్టులు
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, మద్రాస్ ( మహిళలు ) 17 పోస్టులు
విద్యార్హత: సంబంధిత విభాగం నుంచి డిగ్రీ లేదా ఇంజనీరింగ్
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: 200
సెప్టెంబర్ 1 నుంచి 7 వరకూ దరఖాస్తుల్ని ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 8న పరీక్ష ఉంటుంది. దీనికంటే మూడు వారాల ముందు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Also read: Pm Modi: అంతవరకూ అయోధ్యలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన మోదీ