Pm Modi: అంతవరకూ అయోధ్యలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.

Last Updated : Aug 5, 2020, 03:49 PM IST
Pm Modi: అంతవరకూ అయోధ్యలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.

అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మక రామ జన్మభూమిలో( Ram janmabhoomi ) రామ మందిర ( Rammandir ) నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ముగిసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( Pm Narendra modi ) చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగింది. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా ఓ ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది. అదే ప్రధాని మోదీ 29 ఏళ్ల ప్రతిజ్ఞ నెరవేరడం. జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దు ( Abolition of article 370 ) కోరుతూ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి చేసిన తిరంగా యాత్రకు కన్వీనర్ గా మోదీ చివరిసారిగా  1992లో అయోధ్య ( Modi last visit to ayodhy in 1992 ) పర్యటించారు.  రామమందిరం నిర్మించనప్పుడే తిరిగి ఈ ప్రాంతానికి వస్తానని మోదీ అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. మరో విశేషమేమంటే  ఆర్టికల్ 370 రద్దయి కూడా నేటికి ఏడాది.

2019 సార్వత్రిక ఎన్నికల ( 2019 General Elections ) సందర్బంగా ఘజియాబాద్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించినా సరే అయోధ్యను మాత్రం మోదీ సందర్శించలేదు. రాముడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న రామ జన్మభూమిని దర్శించుకున్న తొలి ప్రధాని కూడా మోదీనేనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. Also read: Ayodhya: ఘనంగా జరిగిన భూమిపూజ

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x