UPSC Civil Services Result: UPSC CSE 2022 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం 933 మందిని అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. మొత్తం 933 మందిలో జనరల్‌ కోటాలో 345 మంది ఎంపికయ్యారు. EWS నుంచి 99, OBC నుంచి 263, SC నుంచి 154, ST విభాగం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది ఎంపికవ్వగా.. ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపిక చేసినట్లు యూపీఎస్‌ఎసీ వెల్లడించింది. అదేవిధంగా సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్-ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి


==> ఫలితాలను చెక చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లోకి వెళ్లండి.
==> హోమ్‌పేజీలో ఫలితాల విభాగానికి వెళ్లండి.
==> యూపీఎస్‌సీ ఫైనల్ రిజల్ట్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఎంటర్ చేయండి.  
==> తరువాత డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> అనంతరం ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
==> ఫలితాలను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు అవసరం అనుకుంటే ప్రింట్ అవుట్ తీసుకోండి.


సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సొంతం చేసుకున్నారు. ఇషితా కిషోర్‌ ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో గరిమా లోహియా, మూడో స్థానంలో ఉమా హరిత్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఎన్‌.స్మృతి మిశ్రా నిలిచారు. సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా సత్తాచాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా జాతీయ స్థాయిలో 22 ర్యాంకు సాధించారు. 


Also Read:  Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!  


Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి