Zika Virus in Kanpur: యూపీలో జికా వైరస్‌(Zika Virus In Kanpur) కల్లోలం సృష్టిస్తోంది. కాన్పూర్‌లో 'జికా' చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. తాజాగా ఆదివారం మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 89కి చేరింది. జికా కేసులు  పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) శనివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శానిటైజేషన్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫాగింగ్‌ డ్రైవ్‌ను చేపట్టాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబరు 24న కాన్పూర్‌(Kanpur)లో తొలి జికా కేసు(Zika first Case) నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా(Zika) బారినపడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం.. ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టి వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఐఏఎఫ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా టెస్టులు చేస్తున్నారు.


Also read: యమునా నదిలో ప్రమాదకర స్థాయికి 'అమోనియా'... దిల్లీకి నిలిచిన నీటి సరఫరా!


జికా వైరస్‌(Zika Virus)ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియా(Nigeria)లో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌(Zika Viurs) 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook