Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 20) మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉన్న 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 59 స్థానాల నుంచి మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో దాదాపు 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలోని హత్రాస్, ఫిరోజాబాద్, ఇతహ్, కాస్గంజ్, మెయిన్‌పురి, ఫరుక్కాబాద్, కన్నౌజ్, ఇతవాహ్, ఔరయా, కాన్పూర్ దెహత్,  కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ అసెంబ్లీ స్థానానికి ఈ మూడో విడతలోనే పోలింగ్ జరుగుతోంది.


ప్రస్తుతం పోలింగ్ జరుగుతోన్న ఈ 59 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాలను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 9, కాంగ్రెస్ 1 స్థానం దక్కించుకోగా.. బహుజన్ సమాజ్‌ పార్టీ ఖాతా తెరవలేదు.


ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 7 విడతల్లో అసెంబ్లీ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరిగిన మొదటి విడతలో 58 స్థానాలకు, ఫిబ్రవరి 14న జరిగిన రెండో విడతలో 55 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతతో కలిపి మొత్తం 172 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తవుతుంది. నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో విడత పోలింగ్ మార్చి 3న, తుది విడత పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి. 


Also Read: Surya Dev Pooja: ఆదివారం సూర్యదేవున్ని ఇలా ప్రార్థిస్తే అదృష్టం మీ తలుపు తడుతుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook