Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..

Attack on Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది. 

Written by - Pavan | Last Updated : Feb 3, 2022, 08:51 PM IST
  • ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్ ఒవైసిపై కాల్పుల కలకలం
  • ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు
  • గతంలో హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పుల ఘటనను గుర్తుచేసిన యూపీ ఘటన
Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..

Attack on Asaduddin Owaisi: హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. మీరట్‌కి సమీపంలోని కితౌర్‌లో ప్రచారం ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి వెళ్తుండగా చాజర్సి టోల్ గేట్ వద్ద అసదుద్దీన్ ఒవైసి ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు తన కారుపై మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడినట్టు అసదుద్దీన్ ఒవైసి మీడియాకు వెల్లడించారు. 

Fire opened at Asaduddin Owaisi - అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు: 
కాల్పుల కలకలం అనంతరం మరో కారులో ఢిల్లీకి బయల్దేరిన అసదుద్దీన్ ఒవైసి.. దాడికి సంబంధించిన విషయాలను ట్విటర్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తన అనుచరులు, పార్టీ కార్యకర్తలకు మీడియా ద్వారా తెలియజేసిన అసదుద్దీన్ ఒవైసి.. తాను మరో కారులో ఢిల్లీకి బయల్దేరినట్టు తెలిపారు. దుండగుల కాల్పుల్లో కారు టైరు పంక్చర్ అవడంతో పాటు బుల్లెట్ల ధాటికి కారు పాక్షికంగా దెబ్బతిన్నట్టు కారు దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది.

Fire opened at Akbaruddin Owaisi - అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు: 
అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది. 2011 ఏప్రిల్ 30న తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీకి వెళ్తున్న క్రమంలోనే అక్బరుద్దీన్ ఒవైసిపై దుండుగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులకు పాల్పడటంతో ఆగని దుండగులు.. అనంతరం కత్తులు, డాగర్లతోనూ అక్బరుద్దీన్‌పై, ఆయన అనుచరులపై దాడికి పాల్పడ్డారు. 

Mohammed Pehalwan behind attack -  అక్బరుద్దిన్‌పై కాల్పులు వెనుక మొహమ్మద్ పహిల్వాన్: 
ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి గన్ మెన్ జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ ఒవైసిని అనుచరులు సంతోష్ నగర్‌లోని ఒవైసి ఆస్పత్రికి తరలించారు. అక్బరుద్దీన్ ఒవైసిపై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఓ ఆస్తి వివాదమే అక్బరుద్దీన్‌పై దాడికి కారణమైనట్టు అప్పట్లో తేలింది. తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసిపై (Asaduddin Owaisi house vandalised) జరిగిన కాల్పుల దాడి ఈ పాత ఘటనను మరోసారి గుర్తుచేసింది.

Also read : CM KCR slams BJP: రామానుజా చార్య విగ్రహంతో బీజేపి రాజకీయం.. అసదుద్దీన్ ఒవైసి అక్కడ పార్టనర్.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Also read : Revanth Reddy Strategy: కేసీఆర్, అసదుద్దీన్‌లకు బీజేపి సుపారీ.. ఇదిగో నిదర్శనం: రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News