BJP MLA Mud Bath: ఓవైపు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల జనం వానల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. యూపీలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు చినుకు రాలలేదు. పైగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యేకి ఏకంగా బురద స్నానం చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాజ్‌గంజ్ జిల్లాలోని పిప్రాదియోరా ప్రజలు వర్షాలు లేక అల్లాడుతున్నారు. వర్షాలు కురిసేందుకు తమ ఆచారం ప్రకారం వాన దేవుడైన ఇంద్రుడిని పూజించాలనుకున్నారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియా, మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ జైశ్వాల్‌ను అక్కడికి పిలిపించారు. ఆ ఇద్దరికీ ఒంటి నిండా బురద పూసి స్నానం చేయించారు. తమ ఆచారం ప్రకారం ఇలా బురద స్నానం చేస్తే వాన దేవుడు కరుణిస్తాడని నమ్మకం. ఎమ్మెల్యేకి బురద స్నానం చేయించడంతో.. ఇక తమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


బురద స్నానం చేసిన ఎమ్మెల్యే మంగల్ కనోజియా దీనిపై మాట్లాడుతూ... ఎండ వేడిమితో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంట పొలాలు కూడా ఎండిపోయాయని అన్నారు. దీంతో వారి కోరిక మేరకు బురద స్నానం చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే బురద స్నానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Also Read: Telangana Rain Updates: మరింత బెంబేలెత్తించనున్న వానలు.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్


Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook