Allahabad High Court: పెళ్లి అనేద నూరేళ్ల బంధం. ఒకరికోకరు వివాహ బంధంతో ఒక్కటై, కష్టసుఖాల్లో ఒకరికి మరోకరు ఆసరాగా ఉండాలి. సమాజంలో గౌరవంగా అందరికి ఆదర్శంగా బతకాలి. కానీ ప్రస్తుతం సమాజంలో దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొందరు సమాజంలో పెళ్లికున్న గొప్పతనాన్ని దిగజారేలా ప్రవర్తిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతున్నారు. మరికొందరు వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామితో ఉండలేక.. డైవర్స్ కావాలని కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులు కొందరికి కౌన్సిలింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో విడిపోయిన మహిళకు భరణం ఇవ్వడం విషయంలో తాజాగా అలహబాద్ ఇచ్చిన కోర్టు వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


లక్నోకు చెందిన ఈ కేసులోని జంటకు 2015 లో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. అయితే.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో సదరు మహిళ భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా.. 2016 నుంచి విడిగానే ఉంటుంది. వీరి కేసు ఫ్యామిలీ కోర్టులో విచారిస్తున్నారు. దీనిలో భాగంగా కోర్టు విడిపోయిన భార్యకు నెలకు రూ. 2వేల రూపాయలు మెయింటెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. 


ఇదిలా ఉండగా.. సదరు మహిళ భర్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 ప్రకారం భరణం చెల్లించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానం, నంబర్ 2 ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త ఫిబ్రవరి 21, 2023న అలహబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. తన భార్య ఉపాధ్యాయురాలని ఆమె నెలకు రూ. 10 వేలు సంపాదిస్తుందని అతను కోర్టుకు తెలిపాడు. అంతే కాకుండా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని, తన సోదరుల మీద ఆధారపడి ఉన్న తాను.. విడిపోయిన భార్యకు భరణం చెల్లించలేనని తెలిపాడు. 


దీనిపై అలహబాద్ హైకోర్టు ధర్మాసం తీవ్రగా పరిగణించింది. సదరు మహిళ ఉపాధ్యాయురాలని, నెలకు పదివేలు సంపాదిస్తుందని రుజువుచేసేలా ఏలాంటి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదంది.. అంతే కాకుండా కూలీపని చేసిన కూడా రోజుకు 400 నుంచి 500 వరకు సంపాదించ వచ్చని కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సదరు వ్యక్తి అంజుగార్గ్ ఆరోగ్యంగా ఉన్నాడని, కూలీపని చేసైన భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాలని అలహబాద్ హైకోర్టు ఆదేశించింది. 


Real Also: Highcourt: పెళ్లైన మహిళలకు బిగ్ షాక్.. వేరు కాపురం పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook