UP`s Kushinagar: పెళ్లింట ఊహించని విషాదం... ప్రమాదవశాత్తు బావిలో పడి 13 మంది మృతి...
Tragedy in a Wedding in UP`s Kushinagar: పెళ్లి వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన 13 మంది ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు.
Tragedy in a Wedding in UP's Kushinagar: ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్‌లో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా పెళ్లి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో 13 మంది ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. మృతుల్లో అంతా మహిళలే కావడం గమనార్హం.
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఖుషీనగర్‌లోని నెబువా నౌరంగియా ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం రాత్రి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన కొంతమంది బంధుమిత్రులు ఆ ఇంటి ఆవరణలోని బావి పైకప్పుపై కూర్చొన్నారు. బరువు ఎక్కువవడంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బావి పైకప్పుపై కూర్చొన్నవారంతా అమాంతం బావిలో పడిపోయారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించగా.. అందులో 11 మంది అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి 8.30గం. సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఓవైపు పెళ్లి వేడుకలు జరుగుతుండగానే మరోవైపు ఈ విషాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.
జిల్లా మెజిస్ట్రేట్ ఎస్.రాజలింగం ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. బావిలో పడి 11 మంది చనిపోగా ఇద్దరు గాయపడినట్లు తమకు సమాచారం అందిందన్నారు. పెళ్లి వేడుకలు జరుగుతున్న ఇంట్లో కొంతమంది బావి స్లాబ్‌పై కూర్చొన్నారని... బరువు ఎక్కువై అది కూలిపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరుపున రూ.4లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Also Read: CM KCR Birthday: 68వ వసంతంలోకి కేసీఆర్, ఘనంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook