UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి నామినేషన్.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా

UP CM Yogi Adityanath Nomination: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 04:21 PM IST
  • యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి నామినేషన్
  • గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ
  • అమిత్ షాతో కలిసి నామినేషన్ కార్యాలయానికి యోగి
UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి నామినేషన్.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా

UP CM Yogi Adityanath Nomination: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం (ఫిబ్రవరి 4) గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. నామినేషన్‌కు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అంతకుముందు, ఎన్నికల ర్యాలీలో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌ను సీఎం యోగి మాఫియా కబంద హస్తాల నుంచి విముక్తి చేశాడన్నారు. ఇప్పుడు యూపీలో మాఫియా గనుక ఉంటే.. జైల్లో ఉన్నారని లేదా సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కొన్ని మాఫియా ముఠాలు రాష్ట్రం విడిచి పారిపోయారని అన్నారు. యోగి సారథ్యంలోని యూపీ సర్కార్ కోవిడ్‌ చర్యల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, గతంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి ఆదిత్యనాథ్.. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నిజానికి మథుర లేదా అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. బీజేపీ అధిష్ఠానం ఆయన్ను గోరఖ్‌పూర్ నుంచి బరిలో దింపింది. గోరఖ్‌పూర్‌ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్‌పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం ఏడు విడతల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గానికి మార్చి 3న పోలింగ్ జరగనుంది. 

Also Read: Stock Market today: రెండో రోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 143 మైనస్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News