UP Tragedy: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు దొరికిన టాఫీలు (తీపి పదార్థాలు) తిని నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. టాఫీలు తిన్న వెంటనే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు సహా మరో చిన్నారి ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిన్నారుల్లో పెద్దవాడైన బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. అక్కడ టాఫీలు పడి ఉండటం గమనించాడు. వెంటనే వాటిని తీసుకొచ్చి తన తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులతో పాటు ఇంటి పక్కనుండే మరో చిన్నారితో పంచుకున్నాడు. నలుగురు ఆ టాఫీలు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.


మృతి చెందిన నలుగురు చిన్నారులు ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు. అదే సమయంలో చిన్నారుల కుటుంబాలకు తగిన సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 


Also Read: Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు పరిహారం ప్రకటన


Bhoiguda fire mishap: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి- మృతుల కుటుంబలకు పరిహారం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook