ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం..
UP Road Accident: హైవేపై వేగంగా దూసుకెళ్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో డ్రైవర్ మినహా మిగతా ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని రామమూర్తి ఆసుపత్రి నుంచి బరేలీ జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు.
అంబులెన్స్ మొదట డివైడర్‌ను ఢీకొట్టి.. ఆపై ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని... మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాద ఘటనపై ఫతేగంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదే ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల క్రితం బహ్రయిచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. నన్పారా-లఖీంపూర్ ఖేరీ హైవేపై టెంపో-ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉత్తరప్రదేశ్ వచ్చినట్లు గుర్తించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి క్షతగాత్రులకు తగిన వైద్య సాయం అందించాలని కోరారు. కాగా, ఇటీవలి కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: BJP Rajya Sabha Candidates: రాజ్యసభకు బీసీ నేత డా.లక్ష్మణ్... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలదళం..
Also Read: MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook