Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన స్వస్థలం పౌరిలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలం పౌరికి వెళ్లారు. అక్కడ తన తల్లి సవిత్రా దేవిని కలిసి..ఆశీస్సులు తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం ఇదే మొదటిసారి. తన తల్లిని కలుసుకున్న ఫోటోను యోగి ఆదిత్యనాథ్ ట్విటర్‌లో పంచుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ పలుసార్లు ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. కానీ వ్యక్తిగత పని నిమిత్తం సొంత ఊరికి వెళ్లడం దాదాపు 28 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇవాళ తన కుటుంబంలో జరుగుతోన్న ఓ కార్యక్రమం కోసం ఆయన స్వస్థలం పౌరికి వెళ్లారు.
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2020 ఏప్రిల్‌లో హరిద్వార్‌లో జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేదు. తన తండ్రిని కడసారిచూపు చూసుకోవాలన్న కోరిక ఉన్నా..కరోనా మహమ్మారి వేళ 23 కోట్ల మంది ప్రజల పట్ల ఉన్న బాధ్యతతో వెళ్లలేకపోతున్నాను అని ఆ టైంలో తన నిబద్ధతను సీఎం యోగి ఆదిత్యనాథ్ చాటుకున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక గురువు మహంత్ అవైద్యనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉద్వేగానికి గురయ్యారు. మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కాలేజీలో ఆవిష్కరించారు.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022
Also Read: Mla Jagga Reddy: మంత్రి ఎర్రబెల్లి వీడియోలున్నాయి! ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలనం...
Also Read: Prashanth Kishore Trs Survey:పీకే రిపోర్ట్.. టీఆర్ఎస్ కు 28 సీట్లు... కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.