BJP Rajya Sabha Candidates: రాజ్యసభకు బీసీ నేత డా.లక్ష్మణ్... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలదళం..

BJP Rajya Sabha Candidates: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డా.లక్ష్మణ్‌కు అవకాశం దక్కింది. యూపీ నుంచి బీజేపీ ఆయన్ను నామినేట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 07:57 AM IST
  • బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా
  • తెలంగాణ నుంచి డా.లక్ష్మణ్‌కు ఛాన్స్
  • యూపీ నుంచి లక్ష్మణ్‌ను నామినేట్ చేసిన బీజేపీ
BJP Rajya Sabha Candidates: రాజ్యసభకు బీసీ నేత డా.లక్ష్మణ్... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలదళం..

BJP Rajya Sabha Candidates: రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ రెండో విడత జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అవకాశం కల్పించారు. లక్ష్మణ్‌కు ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం కల్పించడం గమనార్హం. లక్ష్మణ్‌తో పాటు మిథిలేశ్ కుమార్‌కు ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆరుగురిని బీజేపీ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన అభ్యర్థులతో యూపీ నుంచి బరిలో దిగుతున్న రాజ్యసభ అభ్యర్థుల సంఖ్య 8కి చేరింది.

తాజా జాబితాలో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లాల్ సింగ్ సిర్హోయలను బీజేపీ నామినేట్ చేసింది. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 22 మందిని బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇవాళ్టితో (మే 31) నామినేషన్లకు తుది గడువు ముగియనుండటంతో ఈ అభ్యర్థులంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

సంతోషం వ్యక్తం చేసిన డా.లక్ష్మణ్ :

బీజేపీ తనను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల డా.లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశం బీజేపీలో తప్ప మరో పార్టీలో సాధ్యం కాదన్నారు. ఇది ఒక సాధారణ కార్యకర్తకు బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ వ్యూహాత్మకం :

తెలంగాణ నుంచి బీసీ నేత డా.లక్ష్మణ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వ్యూహాత్మకమే అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీజేపీ తరుపున రాజ్యసభకు వెళ్తున్న తొలి నేత లక్ష్మణ్ కావడం విశేషం. రేసులో విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావుల పేర్లు కూడా వినిపించినప్పటికీ చివరకు బీజేపీ అధిష్ఠానం బీసీ నేతకే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తద్వారా బీసీలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పాలనుకుంది. టీఆర్ఎస్ కూడా బీసీ సామాజికవర్గానికే చెందిన వద్దిరాజు (గాయత్రి రవి)కి అవకాశం కల్పించినప్పటికీ.. ఆయనేమీ సామాన్యుడు కాదని బడా పారిశ్రామికవేత్త కాబట్టే అవకాశం ఇచ్చారనే విమర్శ ఉంది. టీఆర్ఎస్ ఒక వ్యాపారవేత్తకు అవకాశం కల్పిస్తే తామొక సామాన్యుడికి అవకాశం కల్పించామని చెప్పుకునేందుకు బీజేపీ అవకాశం చిక్కినట్లయింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే బీసీల్లో మరింత పట్టు సాధించవచ్చునని భావిస్తోంది. 

Also Read: Maithili Suicide Attempt: బుల్లితెర నటి మైథిలి ఆత్మహత్యాయత్నం... నిమ్స్‌కు తరలింపు...   

Also Read: Horoscope Today May 31 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News