Thieves Returned Ancient Idols: ఇటీవలి కాలంలో దేవాలయాల్లో చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. దేవుడంటే భయం, భక్తి లేని కొందరు కేటుగాళ్లు ఏకంగా దేవతామూర్తుల విగ్రహాలే ఎత్తుకుపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ దొంగల ముఠా ఓ ఆలయంలో చోరీకి పాల్పడింది. దేవతామూర్తుల విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఆ ముఠా... వారం తిరక్కుండానే ఆ విగ్రహాలను తిరిగి పూజారి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ విగ్రహాలతో పాటు ఓ లేఖను కూడా అక్కడ వదిలి వెళ్లడం గమనార్హం. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌ జిల్లాలోని తరౌన్హ పట్టణంలో ఉన్న బాలాజీ టెంపుల్‌లో ఈ నెల 9న 16 అత్యంత విలువైన విగ్రహాలు చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన విగ్రహాల్లో కొన్ని విగ్రహాలు రాధాకృష్ణులవి కాగా మరికొన్ని శ్రీ మహావిష్ణువు విగ్రహాలు. 300 ఏళ్ల క్రితం నాటి ఈ అష్టధాతు విగ్రహాల విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఈ చోరీ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా... పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


ఇంతలో ఈ నెల 15న బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి ఇంటి సమీపంలో చోరీకి గురైన విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడో లేఖ కూడా లభించింది. విగ్రహాలను చోరీ చేసిన నాటి నుంచి రాత్రుళ్లు పీడ కలలు వస్తున్నాయని.. కంటి మీద కునుకు లేకుండా పోయిందని లేఖలో రాసి ఉంది. దీంతో దొంగల ముఠానే ఆ విగ్రహాలను తిరిగి అక్కడ పెట్టినట్లు గుర్తించారు. పీడకలలు రావడంతో దేవుడే తమను భయపెడుతున్నాడని భావించి ఆ దొంగల ముఠా విగ్రహాలను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. అయితే చోరీ చేసిన 16 విగ్రహాల్లో కేవలం 14 విగ్రహాలను మాత్రమే పూజారి ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విగ్రహాలు పోలీసులు స్వాధీనంలో ఉన్నట్లు సమాచారం. 


Also Read: Best Zodiac Signs To Marry: ఈ రాశుల వారిని జీవిత భాగస్వామిగా పొందితే... అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు... 


Also Read: Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నారా..? నిజమెంత..?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook