Video: పాపం ఈ దొంగకు ఎంత కష్టం... చిటికెలో ఎస్కేప్ అవాలనుకున్నాడు.. ఇలా అడ్డంగా ఇరుక్కుపోయాడు..

Thief stuck in Temple's Wall: అమ్మవారి ఆలయంలో చోరీకి యత్నించిన ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. గోడలో ఇరుక్కుపోయి బయటకు రాలేక, లోపలికి వెళ్లలేక గిలగిల్లాడిపోయాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 09:40 PM IST
  • శ్రీకాకుళంలో ఓ ఆలయంలో చోరీకి యత్నించిన దొంగ
  • ఎస్కేప్ అయ్యే క్రమంలో గోడలో ఇరుక్కుపోయాడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Video: పాపం ఈ దొంగకు ఎంత కష్టం... చిటికెలో ఎస్కేప్ అవాలనుకున్నాడు.. ఇలా అడ్డంగా ఇరుక్కుపోయాడు..

Thief stuck in Temple's Wall: రంకుతనం దొంగతనం దాచినా దాగదని ఓ సామెత. సాగినన్నీ రోజులు దర్జాగా సాగొచ్చు... కానీ ఏదో ఒక రోజు అడ్డంగా దొరికిపోక తప్పదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ దొంగ ఇలాగే అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా అమ్మవారి ఆలయంలో చోరీకి యత్నించి... ఇక తప్పించుకునే సమయంలో గోడకు ఉన్న కన్నంలో ఇరుక్కుపోయాడు. అటు లోపలికి వెళ్లలేక.. ఇటు బయటకు రాలేక నానా అవస్థ పడ్డాడు. ఈలోగా జనం అక్కడికి చేరడంతో సదరు దొంగ వ్యవహారం బట్టబయలైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా జాడుపూడి గ్రామ శివారులో ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి మంగళవారం (ఏప్రిల్ 5) తెల్లవారుజామున ఆలయంలో చోరీకి వెళ్లాడు. ఆలయ గోడకు ఉన్న కిటికీ ఊచలు పీకి లోపలికి చొరబడ్డాడు. లోపల అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను సర్దేశాడు. ఇక చిటికెలో అక్కడి నుంచి బయటపడాలనుకున్నాడు.

కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు పాపం సదరు దొంగ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. గోడకు చేసిన కన్నం నుంచి బయటపడే క్రమంలో అందులోనే ఇరుక్కుపోయాడు. అంతే.. ఇక లోపలికి వెళ్లలేక, బయటకు రాలేక గిలగిల్లాడిపోయాడు. ఇంతలో విషయం గ్రామస్తులకు తెలియడంతో అంతా అక్కడికి చేరుకున్నారు. ఆ సీన్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. ఆలయం వద్దకు చేరుకుని దొంగతనానికి యత్నించిన పాపారావును అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: Modi Chocolates: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూతురికి మోదీ చాక్లెట్లు...

MIM Corporator Threatens Police: మరీ ఇంత అరాచకమా.. పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News