Uttarakhand Floods: దక్షిణాదిన కేరళ..ఉత్తరాదిన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్నాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు హృదయ విదారకంగా మారుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వరద ప్రవాహం ధాటికి ఓ బ్రిడ్జి ఎలా కూలుతుందో రికార్డైన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు కేరళలో భారీ వర్షాలు(Kerala Floods), వరద సృష్టిస్తున్న భీభత్సం నుంచి తేరుకోకముందే ఉత్తరాధిన ఉత్తరాఖండ్ రాష్ట్రం భారీ వర్షాలతో(Heavy Rains)కుదేలవుతోంది. ఆ రాష్ట్రంలో వర్షం విధ్వంసం సృష్టిస్తోంది. ఎటు చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే మునిగిపోయాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలామంది వరదనీటిలో చిక్కుకొనిపోయారు. కొన్నిచోట్ల ఏనుగులు సైతం వరదలో చిక్కుకుపోయాయి. ఇళ్లపై ఉండి కాపాడాలంటూ కేకలు వేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు భారీ వర్షం ధాటికి కూలిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగిస్తోంది.10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


అదే సమయంలో వరద బీభత్సానికి బ్రిడ్జి కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటిమట్టం పెరగడంతో బ్రిడ్జి కూలిపోతున్న(Bridge Collapsing Video) దృశ్యం అందరిని ఆందోళనకు గురి చేసింది. వీడియోలో బ్రిడ్జి కూలుతున్న సమయంలో అటువైపు నుంచి ఓ వ్యక్తి  బైక్‌పై వస్తుండగా ఇటువైపు ఉన్న వ్యక్తి రావద్దని వాదించడం మనం వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. అటునుంచి వస్తున్న వ్యక్తిని అలర్ట్ చేయడంతో ఆ వ్యక్తి ఆగిపోతాడు. అదే సమయంలో బ్రిడ్జి మెల్లగా కూలిపోవడం వీడియోలో చూడవచ్చు. హల్ద్వానీలోని గౌలా నదిపై వంతెన కూలుతున్న దృశ్యమిది.



ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హరిద్వార్‌లోని గంగానదికి సమీపంలో ఉన్న ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. మరోవైపు కోసి నదిలో నీటిమట్టం పెరగడంతో రాంనగర్ గార్జియా దేవాలయానికి ముప్పు ఏర్పడింది. ఆలయం మెట్ల వరకు నీరు చేరింది. అదే సమయంలో బ్యారేజ్ అన్ని గేట్లు తెరిచారు. కోసి బ్యారేజీ  నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఆందోళన కల్గిస్తోంది. 


Also read: Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook