Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2021, 03:48 PM IST
  • మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన సమాధానమిచ్చిన మంచు మనోజ్
  • మా సర్కస్ అయితే మీరొక రింగ్ మాస్టర్ అంటూ మంచు మనోజ్ ట్వీట్
  • మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ ట్వీట్స్ వైరల్
Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన మా ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముగిశాయి. మా ఎన్నికల్లో(MAA Elections2021)మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. మా ఎన్నికలు జరిగి పదిరోజులు కావస్తున్నా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశ్‌రాజ్ ఆరోపించడమే కాకుండా పోలీసుల సమక్షంలో మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికల్లో గెలిచామని..ప్రకాశ్‌రాజ్(Prakash raj)ఆరోపణలు అర్ధరహితమని మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేశాడు. మా ఎన్నికల ప్రహసనం, ఇరువర్గాల ఆరోపణలతో సినీ పెద్దలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal varma)సోషల్ మీడియా వేదికగా మా ఎన్నికలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని..అందులోని సభ్యులంతా జోకర్లని వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటికే వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మంచు మనోజ్(Manchu Manoj)దీటైన కౌంటర్ ట్వీట్ చేశాడు. మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ అంటూ ట్వీట్ చేశాడు. మంచు మనోజ్ ట్వీట్‌కు రాంగోపాల్ ఏం సమాధానమిస్తాడో చూడాలి.

Also read: Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News