Vaishno Devi Stampede : 12 Dead, several injured Rescue Operations Under Way : కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని (Jammu and Kashmir) రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణో‌దేవి ఆలయంలో (Mata Vaishno Devi shrine) శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. దీంతో 12 మంది భక్తులు మరణించారు. 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. నూతన సంవత్సరం (New Year) సందర్భంగా మాతా వైష్ణో‌దేవి ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే తమకు అందిన సమాచారం మేరకు.. భక్తుల మధ్య మొదట ఒక చిన్న వివాదం తలెత్తడంతో.. తోపులాట జరిగిందని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ (J&K DGP) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. తర్వాత తొక్కిసలాట తీవ్రంగా మారినట్లు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. మృతులు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


వైష్ణో‌దేవి ఆలయం తొక్కిసలాట (Vaishno Devi Stampede) విషాదంపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఇక మృతుల కుటుంబాలకు 2 లక్షల తక్షణ పరిహారం, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. 


అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ గోపాల్‌దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు.


Also Read : PM Kisan 10th Installment: కేంద్రం గుడ్​ న్యూస్​- పీఎం కిసాన్​ నిధుల విడుదల నేడు!


బాధిత కుటుంబ సభ్యులకు జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా (Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha) సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, అలాగే గాయపడినవారికి 2 లక్షలు రూపాయల ప్రకారం పరిహారం (ex gratia) అందిస్తామన్నారు.



 


ఇప్పటికే పలువురు ప్రముఖులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.









 


Also Read : U19 Asia Cup: శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ గెలిచిన భారత్! 8వసారి కప్‌ కైవసం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook