U19 Asia Cup: శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ గెలిచిన భారత్! 8వసారి కప్‌ కైవసం!!

అండర్-19 ఆసియా కప్‌ 2021 టైటిల్‌ను యువ భారత్ కైవసం చేసుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 09:02 PM IST
  • శ్రీలంకపై భారత్ ఘన విజయం
  • ఆసియా కప్ 2021 గెలిచిన భారత్
  • భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం
U19 Asia Cup: శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ గెలిచిన భారత్! 8వసారి కప్‌ కైవసం!!

India beat Sri Lanka to clinch Under-19 Asia Cup 2021: అండర్-19 ఆసియా కప్‌ 2021 టైటిల్‌ను యువ భారత్ (India) కైవసం చేసుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్) శ్రీలంక (Sri Lanka)పై ఘన విజయం సాధించింది. దాంతో వరుసగా మూడోసారి అండర్‌ -19 ఆసియా కప్‌ (Under-19 Asia Cup)ను సొంతం చేసుకుని సత్తా చాటారు. ఇక ఆసియా కప్‌ చరిత్రలో ఏడు సార్లు భారత్‌ గెలవగా.. ఒకసారి పాకిస్థాన్‌తో పంచుకుంది. ఈ విజయంలో టీమిండియా ఓపెనర్ ఆంగ్రిష్ రఘువంశీ (56 నాటౌట్), షేక్ రషీద్ (31 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచుకు వర్షం అడ్డుపడింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను అంపైర్లు 38 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లంక 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. బి భారత బౌలర్లు లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్, ఆఫ్ స్పిన్నర్ కౌశల్ తాంబే శ్రీలంక బ్యాటర్లకు ఊపిరి పీల్చుకోనివ్వలేదు. విక్కీ 8 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తాంబే 6 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

Also Read: Florona disease: కరోనానే కలవరపెడుతుంటే.. కొత్తగా 'ఫ్లొరోనా' వ్యాధి!

107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ అద్భుతంగా ఆడింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ ఆంగ్రిష్ రఘువంశీ అర్థ శతకంతో చెలరేగాడు. షేక్ రషీద్ (31 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఇద్దరు ఆచితూచి ఆడారు. ఈ సమయంలో మరోసారి వర్షం కురవడంతో భారత ఇన్నింగ్స్‌ను 32 ఓవర్లకు కుదించారు. లక్ష్యాన్ని కూడా 104 పరుగులకు తగ్గించారు. వర్షం పడినా రషీద్, రఘువంశీ లంక బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. చివరకు భారత్ 21.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత్ మరో 63 బంతులుండగానే 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.

అండర్-19 ఆసియా కప్‌ (U19 Asia Cup 2021)లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తంగా భారత్ 8వసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆసియా కప్‌ టోర్నీని భారత్ తొలిసారిగా 1989లో గెలుచుకుంది. అనంతరం 2003, 2012లో పాకిస్థాన్‌తో ట్రోఫీని పంచుకుంది. ఆపై 2013, 2016లో భారత్ టోర్నీని కైవసం చేసుకుంది. 2017లో ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక 2018, 2019, 2021లో ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. దాంతో ఈ ట్రోఫీని భారత్ (Team India) వరుస మూడుసార్లు అందుకుంది.

Also Read: Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News