Vande Bharat Train Hit nilgai deer: వందే భారత్ రైళ్లు తరచూ ఏదో ఒక జంతువు బలి అవుతూనే ఉంది. తాజాగా ఓ నీలగై జింకను వేగంగా వెళ్తున్న ఓ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో  ఆ జింక ఎగిరి ఒక వ్యక్తిపై పడింది.  ఈ ఘటనలో జింక, వ్యక్తి ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందిన వ్యక్తిని శివదయాల్ గా గుర్తించారు. ఇతడిని పోస్టుమార్ట నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదానికి కారణమైన వందే భారత్ రైలు ఢిల్లీ నుంచి రాజస్థాన్ లోని ఆజ్మీర్ కు వెళ్తోంది. స్పాట్ లోనే  జికంతోపాటు శివదయాళ్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శివదయాల్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు అధికారులు. డెడ్ బాడీని పోస్టుమార్టం చేసిన తర్వాత ఫ్యామిలికీ అప్పగించనున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. శివదయాళ్ రైల్వే శాఖలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఈ ప్రమాదం జరిగిన కొంత సేపటి వరకు రైలును ఘటనాస్థలిలోనే నిలిపేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునారవృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


Also Read: Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై


Also Read: Train Accident: బిలాస్‌పూర్ సమీపంలో ఘోర ప్రమాదం, రెండు రైళ్లు ఢీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook