Vande Bharat Train: దేశంలో అత్యంత వేగంగా వెళ్లై రేలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఇది సెమీ హైస్పీడ్ ట్రైన్. వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవి అనుకున్నంతగా ఆదరణ పొందడం లేదా  అనే వార్తలు విన్పిస్తున్నాయి. లేదా కొన్ని రూట్లలోనే ఆదరణ ఉందా అని విన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ వరకూ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆటంకం ఏర్పడింది. ఈ రూట్‌లో ఇకపై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరగదు. ఈ రైలును పూర్తిగా రద్దు చేసేసింది ఇండియన్ రైల్వేస్. ఊహించినంతగా వందేభారత్ రైళ్లు కొన్ని రూట్లలో ఆదరణకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఆశించినమేర ప్రయాణీకులు ఉండటం లేదు. కొన్ని రూట్లలో 50 శాతమే ఆక్సుపెన్సీ ఉంటోంది. ఇలాంటి రూట్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే విషయం రైల్వే శాఖ పునరాలోచించనుంది.


నాగపూర్-బిలాస్‌పూర్ వందేభారత్ ఎక్క్‌ప్రెస్ రైలుని మాత్రం కేవలం ఆక్సుపెన్సీ ఊహించినంతగా లేని కారణంగా రద్దు చేశారు. ఈ స్థానంలో ఇదే రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. తేజస్ కూడా దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు. ఇప్పుడు వందేభారత్ అత్యంత వేగంగా వెళ్లే రైలు. తేజస్ రెండవ స్థానంలో వస్తుంది. రద్దయిన నాగపూర్-బిలాస్‌పూర్ రైలు కోచ్‌లను తిరుపతి-సికింద్రాబాద్ రూట్‌లో వినియోగించనున్నారు. దేశంలో వందేభారత్ ఉన్న 15 రూట్లలో నాగ్‌పూర్-బిలాస్‌పూర్ రూట్ ఒక్కటే అత్యల్ప ఆదాయం కలిగి ఉంది.


2022 డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ రైలుని ప్రారంభించారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నందునే ఈ రూట్‌లో ఆక్సుపెన్సీ 50 శాతమే ఉందని తెలుస్తోంది. బిలాస్‌పూర్-నాగపూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూ‌వ్ క్లాస్ టికెట్ 2,045 రూపాయలు కాగా ఏసీ ఛైర్ కార్ టికెట్ ధర 1.75 రూపాయలుంది.ఇప్పుడు రద్దయిన ఈ ట్రైన్ స్థానంలో ఇదే రూట్లో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను 2017లో ఇండియన్ రైల్వేస్ తొలి కార్పొరేట్ రైలుగా లాంచ్ చేసింది. ఐఆర్సీటీసీ ద్వారా ఈ ట్రైన్ నిర్వహణ ఉంటుంది. 


Also read: Karnataka Politics: సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్, తేలని సీఎం పంచాయితీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook