Chandrashekhar Guruji Murder: కాళ్లు మొక్కినట్లు నటించి కత్తులతో పొడిచి చంపారు.. ప్రముఖ వాస్తు నిపుణుడి హత్యకు కారణమదేనా..?
Chandrasekhar Guruji Murder: చంద్రశేఖర్ గురూజీ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
Chandrasekhar Guruji Murder: ప్రముఖ వాస్తు నిపుణుడు, సరళ వాస్తు పేరుతో ప్రసిద్ధి చెందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక హుబ్బలిలోని ప్రెసిడెంట్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గం. సమయంలో ఈ హత్య ఘటన చోటు చేసుకుంది. గురూజీ వద్ద వాస్తు సలహాలు పొందే నెపంతో హోటల్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ను కత్తులతో పొడిచి చంపారు. మొదట ఓ వ్యక్తి గురూజీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఆయన కాళ్లకు నమస్కరించినట్లు నటించాడు. ఆ వెంటనే.. పక్కనే ఉన్న మరో వ్యక్తి కత్తితో గురూజీపై దాడి చేశాడు. ఆపకుండా గురూజీని కత్తితో పలుమార్లు పొడిచాడు.
రక్తపు మడుగులో పడిపోయిన గురూజీని హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. హోటల్ లాబీలోనే హత్య ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు హంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని కూడా కత్తులతో బెదిరించారు. దీంతో అంతా చూస్తుండగానే గురూజీ హత్యకు గురయ్యారు. హత్యానంతరం నిందితులు పారిపోగా.. కొద్ది గంటల్లోనే పోలీసులు వారిని పట్టుకున్నారు.
హత్యకు కారణమిదేనా..?:
చంద్రశేఖర్ గురూజీ హంతకులను పోలీసులు బెల్గావి జిల్లాలో అరెస్ట్ చేశారు. వారిని మహంతేశ్, మంజునాథ్‌గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ గతంలో చంద్రశేఖర్ గురూజీ వద్ద పనిచేశారు. ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రశేఖర్ గురూజీ బినామీ ఆస్తులు మహంతేశ్ భార్య వనజాక్షి పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ సమయంలో చంద్రశేఖర్ గురూజీకి చాలా నష్టాలు రావడంతో.. వనజాక్షి పేరిట ఉన్న ఆస్తులను తనకు తిరిగిచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు వనజాక్షి భర్త మహంతేశ్ ఒప్పుకోలేదు. చంద్రశేఖర్ గురూజీ నుంచి ఈ విషయంలో రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో మహంతేశ్ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం హుబ్బలికి వచ్చిన చంద్రశేఖర్‌ను మంజునాథ్‌తో కలిసి హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Editor Gautham Raju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత..
Also Read: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook