Vegetable vendor Babina Bai slapped Gwalior Minister Pradyuman Singh Thakur: మన దేశంలో రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నాయకులూ ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తుంటారో అందరికీ తెలిసిన విషయమే. చిన్నపాటి లీడర్ నుంచి పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి వరకు తమ పదవి, అధికార బలంను చూపించుకుంటారు. తమకు ఓటివేసి గెలిపించిన ప్రజల కష్టాలు కూడా పట్టని వారు కొందరు ఉంటారు. అయితే మధ్యప్రదేశ్‌ మంత్రి (Madhya Pradesh Minister) ప్రద్యుమాన్‌ సింగ్ తోమర్ (Pradyuman Singh) మాత్రం అందరికంటే బిన్నం. తన వల్ల నష్టపోయిన ఓ బామ్మ కాళ్లు పట్టుకుని మరీ చెంప దెబ్బలు కొట్టించుకున్నారు. అసలు విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ పట్టణం (Gwalior)లోని హజీరాలో ఓ కూరగాయల మార్కెట్ (Vegetable Market) ఉంది. రోడ్డుపై రద్దీకి కారణమౌతుందని ఆ కూరగాయల మార్కెట్​ను మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఉన్నపళంగా గ్వాలియర్‌ ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయల మండిని పరిశీలించేందుకు, వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు గురువారం మంత్రి ప్రద్యుమాన్‌ సింగ్‌ తోమర్ వెళ్లారు. అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకునే వారి దగ్గరకు వెళ్లిన మంత్రి వారు చెప్పే సమస్యలు వింటూ.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.


Also Read: Anasuya Sankranthi Celebrations: అనసూయ సంక్రాంతి సంబరాలు.. పార్కులో భర్తతో కలిసి.. !!


ఈ క్రమంలో బాబినా భాయ్ (Babina Bai) అనే వృద్ధురాలు దగ్గరికి వెళ్లిన మంత్రి ప్రద్యుమాన్‌ సింగ్‌ తోమర్.. మీకు ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. వెంటనే ఆమె మున్సిపల్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ వ్యాపార దుకాణాలు వేరే చోటికి మార్చడం సరైన నిర్ణయమేనా? అంటూ మంత్రిని ప్రశ్నించారు. బామ్మను (Vegetable Vendor) శాంతింపజేసిన మంత్రి పరిస్థితిని వివరించారు. ఈ అసౌకర్యానికి క్షమించమని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అంతేకాదు బాబినా భాయ్ రెండు చేతులను తన చేతుల్లో తీసుకొని నన్ను కొట్టండి అని అన్నారు. ఆమె ఆశ్చర్యపోవడంతో.. ఏం మీ కొడుకు తప్పు చేస్తే కొట్టారా?, కొడుకును దండించే హక్కు ఓ తల్లిగా మీకు లేదా? అంటూ వృద్ధురాలితో చనువుగా ప్రవర్తించారు. 


చివరకు కూరగాయలు అమ్ముకునే వృద్దురాలు మంత్రి తలను తన భుజానికి హత్తుకున్నారు. దీంతో మంత్రి ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మినిష్టర్ ప్రద్యుమాన్‌ సింగ్ తోమర్‌కి ఇలా చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు రోడ్లపై చెత్త ఊడ్వటం, మురుగు కాలువలోకి దిగి పేరుకుపోయిన వ్యర్దాలను తొలగించడం, పబ్లిక్‌ టాయిలెట్స్‌ శుభ్రపరచడం వంటివి బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం మంత్రికి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 


Also Read: Acharya Official Announcement: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'ఆచార్య' సినిమా వాయిదా ! రిలీజ్ ఎప్పుడంటే..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook