Tribute To Ex PM PV: మాజీ ప్రధాని పీవీకి ప్రముఖుల ఘన నివాళి
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narsimha Rao centenary birth celebrations ) శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా పీవీ సేవల్ని కొనియాడారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narsimha Rao centenary birth celebrations ) శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Vice president Venkaiah Naidu ) ఈ సందర్బంగా పీవీ సేవల్ని కొనియాడారు. అటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 12 మంది మృతి
దేశ తొమ్మిదో ప్రధానిగా 1991-96 మధ్యకాలంలో ( Country’s 9th prime minister PV) సేవలందించిన పీవీ నరసింహారావు... ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బహుభాషా కోవిదుడిగా ప్రాచుర్యం పొందిన పీవీ... తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో 1921 జూన్ 28న జన్మించారు. 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం (Rajiv Gandhi Assasination ) ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో...
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ జ్ఞానభూమి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అటు గాంధీభవన్‌లో పీవీ శత జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళి అర్పించాయి. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టిన ఘనత పీవీదేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ రాజనీతిని చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు.
ఏపీలో...
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళి అర్పించారు. ట్విట్టర్ వేదికగా పీవీ గొప్పతనాన్ని వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) కీర్తించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని, బహుభాషా కోవిదుడని, ఆయన చేసిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని ట్వీట్ చేశారు జగన్. దేశాభివృద్ధికి పీవీ చేసిన సేవల్ని భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకుంటాయన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ