Karnataka: బీజేపీ ఎమ్మెల్యే హత్యకు డీల్-సంచలనం రేపుతోన్న కాంగ్రెస్ నేత వీడియో
Karnataka Congress leader plans to murder BJP MLA: కర్ణాటకలోని యెలహంక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ హత్యకు కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుతున్న వీడియో బయటకు లీకవడం తీవ్ర సంచలనం రేపుతోంది.
Karnataka Congress leader plans to murder BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ (MLA SR Vishwanath) హత్యకు స్కెచ్ వేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ (MN Gopalakrishna) అడ్డంగా దొరికిపోయారు. హత్యకు సంబంధించి ఆయన ఓ వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో లీకైంది. హత్యకు ఎంత డబ్బు ఖర్చయినా పర్లేదు.. ఆ ఎమ్మెల్యేను లేకుండా చేయాలని గోపాలకృష్ణ మాట్లాడటం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ఈ వీడియో సంచలనం రేపుతోంది.
మూడు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో (Viral Video) గోపాలకృష్ణ సోఫాలో కూర్చొని ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 'ఆ ఎమ్మెల్యేను చంపెయ్... అందుకు రూ.1కోటి లేదా ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. అతన్ని ఫినిష్ చేసేయ్... ఈ విషయం మన మధ్యే ఉండాలి... ఎవరికీ తెలియకూడదు.' అని అతనితో చెప్పాడు. దీనిపై స్పందించిన పోలీసులు... ఆ వీడియో ఎప్పటిదనే విషయంలో స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం ఆ వీడియోపై ఎంక్వైరీ చేస్తున్నామని... త్వరలోనే అన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.
కర్ణాటక (Karnataka) హోంమంత్రి జ్ఞానేంద్ర ఈ వీడియోపై స్పందిస్తూ... ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే విశ్వనాథ్ కూడా దీనిపై తనతో మాట్లాడినట్లు చెప్పారు. 'ఈ వీడియో గురించి గత రాత్రే నాకు తెలిసింది. ఎఫ్ఐఆర్ విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు భద్రత పెంచే ఆలోచనలో ఉన్నాం. దీనిపై ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.' అని తెలిపారు.
Also Read: Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్
ప్రస్తుతం ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ (Karnataka) యెలహంక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2018లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ విశ్వనాథ్‌పై దాదాపు 80 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ కక్షతోనే గోపాలకృష్ణ విశ్వనాథ్‌పై హత్యకు కుట్ర పన్నారా... లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook