Minor Boys Married: వింత ఆచారం.. ఐదో తరగతి అబ్బాయిలకు పెళ్లి చేసిన గ్రామస్తులు
Two Minors Marriage in Karnataka: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో వింత ఆచారం ఉంది. తమ గ్రామంలో వర్షాలు కురవాలని అక్కడి ప్రజలు ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయి.. మరో అబ్బాయి మెడలో తాళి కట్టాడు.
Two Minors Marriage in Karnataka: వరుణ దేవుడు కరుణించాలంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూసుంటారు.. ఊరంతా కలిసి భజన కార్యక్రమాలు చేయడం చూసుంటారు.. సుదూర ప్రాంతాల నుంచి గంగా జలం తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయడం చూసుంటారు. కానీ కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామంలోని ప్రజలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వరుణుడు కరుణించాలని.. తమ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేశారు.
చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో రైతులు ఎక్కువగా రాగి పంటలు వేశారు. అయితే గత కొద్దిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట దెబ్బతింటోందని ఆందోళన చెందారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు పౌర్ణమి రోజున ఐదో తరగతి చదువుతున్న మైనర్ అబ్బాయిలకు వివాహం చేశారు. ఇక్కడ ఇలాంటి ఆచారం ఎప్పటి నుంచో ఉందని స్థానికులు చెబుతున్నారు. చింతామణి తాలూకా హిరేకట్టిగెనహళ్లిలో ఈ ఘటన జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు.. చుట్టు పక్కల కూడా వర్షాలు కురిసేందుకు ఇలా ప్రత్యేక పూజలు చేస్తామని ప్రజలు అంటున్నారు.
స్థానిక రైతు మంజునాథ్ మాట్లాడుతూ.. ఇద్దరు మైనర్ అబ్బాయిలకు పెళ్లి జరిగిన అరగంటలోనే గ్రామంలో వర్షం కురిసిందని చెప్పారు. వర్షం కురవడంతో తమ గ్రామంలోని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అబ్బాయిలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని ఎప్పటి నుంచో నమ్మకం ఉందని అన్నారు.
ఇద్దరు అబ్బాయిల పెళ్లిని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇద్దరిలో ఒకరు వరుడు కాగా.. మరో అబ్బాయి పెళ్లికూతురు వేషంలోకి మారిపోయాడు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగినట్లే.. ఒక అబ్బాయి మరో అబ్బాయి మెడలో మంగళసూత్రం కట్టాడు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వివాహంలో పెళ్లి చేసుకున్న అబ్బాయిలకు హారతి ఇచ్చి.. బహుమతులు కూడా ఇవ్వడం విశేషం. ఈ పెళ్లి సంబంధం ఇంతటితోనే ఆగిపోతుందని.. ఆ అబ్బాయిలు తరువాత సాధారణ జీవితం గడుపుతారని స్థానికులు అంటున్నారు.
Also Read: India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఫలితం తేలని మ్యాచ్..
Also Read: Ishan Kishan: ధోనీ ఆడిన జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ ఎందుకు మారాడు..? అసలు నిజం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook