Agnipath Scheme: `అగ్నిపథ్` స్కీమ్‌పై తీవ్ర నిరసనలు.. బీహార్‌లో హింసాత్మక సంఘటనలు.. రైలుకు నిప్పు..
Protests against Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌పై యువత నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీహార్ యువత నిరసనలకు దిగారు.
Protests against Agnipath Scheme: రక్షణ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ నియమాకాలకు కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర విమర్శలు,ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నాలుగేళ్ల కాల పరిమితితో యువకులను ఉద్యోగాల్లోకి తీసుకోవడమంటే.. వారి భవిష్యత్తును బలిపెట్టడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్ పట్ల యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా బీహార్ యువత ఈ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. రోడ్లు, రైలు పట్టాల పైకి చేరి నిరసన తెలియజేశారు.
పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శరన్ జిల్లాలోని ఛప్రా వద్ద నిరసనకారులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు. ఆరా రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు రాళ్లు రువ్వారు. భాగల్‌పూర్, అర్వాల్, బక్సర్, గయా, మంగర్, నవాడా, సహస్ర, సివన్, ఔరంగాబాద్ జిల్లాల్లోనూ స్థానిక యువత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బక్సర్ జిల్లాలో దాదాపు 100 మంది యువత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి రైలు పట్టాలపై బైఠాయించారు. జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు అక్కడినుంచి కదలనివ్వలేదు.
జహానాబాద్‌లోనూ యువత పాట్నా-గయా రైలు మార్గంలోని పట్టాలపై బైఠాయించారు. సహస్ర జిల్లాలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పాట్నా రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన నిరసనకారులు రోడ్డుపై వాహనాల టైర్లకు నిప్పంటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జెహానాబాద్ నిరసనల్లో పాల్గొన్న ఓ యువకుడు మాట్లాడుతూ.. 'అగ్నిపథ్ స్కీమ్ కింద నాలుగేళ్లు సర్వీసులోకి తీసుకుంటారు. కానీ ఆ నాలుగేళ్ల తర్వాత మేమెక్కడికి వెళ్లాలి. అందుకే రోడ్ల పైకి చేరి నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వారికి అన్ని విషయాలు తెలుసునని ఈ దేశాన్ని ఏలుతున్న నేతలు గుర్తుంచుకోవాలి..' అని పేర్కొన్నాడు.
కాగా, అగ్నిపథ్ స్కీమ్ కింద రక్షణ శాఖ సర్వీసుల్లో చేరే యువత నాలుగేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. మిగతావారికి రూ.12 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగం నుంచి పంపిస్తారు. వీరికి ఫించన్ సౌకర్యం ఉండదు. కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్ యువతలో ఆగ్రహావేశాలను రగిలించింది. ఇలాంటి రిక్రూట్‌మెంట్ పాలసీలు యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Renuka Chowdhury: పోలీసులపై రేణుకా చౌదరి చిందులు..ఎస్సై చొక్కా పట్టుకున్న నేత..!
Also Read: భారత కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. 12 నెలలో ఆరుగురు కెప్టెన్లు! టీమిండియాకు టీ20 ప్రపంచకప్ కష్టమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook