Electricity Bills: ప్రజా ప్రతినిధులకు భారీ మినహాయింపులు ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు దాదాపు అన్ని మినహాయింపులు పొందుతుంటారు. ఇకపై అలాంటివి కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలే కడుతున్నారు మీరు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేరా? అని ప్రశ్నించారు. ఇకపై ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేశారు. ఆయనో ఎవరో కాదు సంచలనాలకు మారుపేరుగా నిలిచే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kangana Ranaut: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జీతమెంతో తెలుసా? నెలకు ఆమె సంపాదన ఇంత భారీగానా?


స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తున్న విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. జూలై 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రిగా నేను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆ బిల్లులు చెల్లించారని స్పష్టం చేశారు. రాజధాని గువాహటిలో సోమవారం విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

Also Read: BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?


'మంత్రులు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, సచివాలయ అధికారుల నివాసాలకు దశాబ్దాలుగా విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రజలు చెల్లించే పన్నులతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్‌ బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతున్నాం' అని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. వీవీఐపీలు బిల్లుల చెల్లింపుతో విద్యుత్‌ బోర్డుకు వచ్చే నష్టాలు నివారించవచ్చని, చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సౌర విద్యుత్‌ వినియోగం పెంచాలని సంబంధిత అధికారులకు చెప్పారు. విద్యుత్‌ ఆదా చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter