BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?

Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్‌ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 13, 2024, 06:09 PM IST
BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?

BS Yediyurappa: మైనర్‌ను అత్యాచారం చేశారనే ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయన అరెస్ట్‌ తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా యడియూరప్ప అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ లభించకపోవడంతో కర్ణాటకలో కలకలం రేపుతోంది.

Also Read: Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్

సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా యడియూరప్పపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ యడియూరప్పపై పోక్సో కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 14వ తేదీన సీఐడీ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టింది.

Also Read: Viral Incident: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం భర్త హల్‌చల్‌.. అర్ధరాత్రి పోలీసులకు ముప్పుతిప్పలు

ఆధారాలు ధ్వంసం
అయితే ఈ కేసు విచారణ ఆలస్యమవుతోందని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని బాధితురాలి సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం యడియూరప్పకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.  బాధితురాలి తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ అశోక్‌ నాయక్‌ వాదనలు వినిపించారు. 'ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బలమైన నాయకుడు. రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.అతడి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎంపీ, ఒకరు పార్టీ అధ్యక్షుడు. సీఐడీ నోటీసులు అందించినా కూడా ఆయన విచారణకు హాజరు కావడం లేదు.సంటన సమయంలో బాధితురాలికి యడియూరప్ప రూ.2 లక్షలు ఇచ్చారు. వీడియో సాక్ష్యాలు ఉంటే వాటిని బలవంతంగా బాధితురాలి తల్లితో డిలీట్‌ చేయించారు. ఆయన విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరుతున్నారు. ఆయనకు మరింత సమయం ఇస్తే సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం చేస్తారు. ఈ కారణం చేత యడియూరప్పను త్వరగా అరెస్ట్‌ చేసి విచారణ చేయాలి' అని అశోక్‌ నాయక్‌ బలంగా వాదించారు. వాదనలు విన్న పొక్సో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 1 యడియూరప్పకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

కేసు ఇక్కడ
ఒకరు మోసం చేయడంతో సహాయం చేయాలంటూ యడియూరప్ప వద్దకు బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2వ తేదీన యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో యడియూరప్ప అమానుషంగా ప్రవర్తించారని మహిళ ప్రధాన ఆరోపణ. తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల మృతి చెందడం గమనార్హం. అయితే అప్పటికే బాధితురాలు,ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డు చేయడంతో కేసు విచారణకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.

యడియూరప్ప అదృశ్యం
ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి యడియూరప్ప కనిపించడం లేదు. మాజీ సీఎం అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. లేకపోతే ఢిల్లీలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్నా కూడా ఆయన ఆచూకీ మాత్రం లభించడం లేదు. అయితే హైకోర్టులో విచారణకు యడియూరప్ప హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.

చట్టం అందరికీ సమానం
ఈ వ్యవహారంపై కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండు రావు స్పందించారు. 'చట్టం అందరికీ సమానమే. ఆ సంఘటన వాస్తవంగా జరిగి ఉంటే చట్టం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటంటారు.  చట్టానికి ఎవరూ అతీతులు కాదు. అవసరమైతే అతడిని అరెస్ట్‌ చేస్తుంది. అయితే ఆ విషయం నేను చెప్పను. సీఐడీ చెబుతుంది' అని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News