Kangana Ranaut: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జీతమెంతో తెలుసా? నెలకు ఆమె సంపాదన ఇంత భారీగానా?

Mandi MP Kangana Ranaut Salary And Allowance How Much Monthly: సినిమాలతో అగ్రతారగా వెలుగొందిన క్వీన్‌ కంగనా రనౌత్‌ ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె జీతం ఎంత, నెలకు ఎంత తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 17, 2024, 03:50 PM IST
Kangana Ranaut: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జీతమెంతో తెలుసా? నెలకు ఆమె సంపాదన ఇంత భారీగానా?

Kangana Ranaut Salary: స్వశక్తితో సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు అగ్ర నటిగా వెలుగొందుతున్న కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి సత్తా చాటింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. సినిమాలపరంగా విజయవంతమైన కంగనా ఇక రాజకీయపరంగా ఫుల్‌ బిజీ అయ్యారు. అయితే ఎంపీగా గెలిచిన ఆమె జీతం ఎంత పొందుతున్నారనేది ఆసక్తిగా మారింది. సినిమాల్లో నటిస్తూ కోట్లు కొల్లగొడుతున్న ఆమె మరి ఎంపీగా ఎంత సంపాదన పొందుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం నెటిజన్లకు ఆసక్తికరం. ఇప్పుడు ఎంపీగా కంగనా రనౌత్‌ సంపాదన కూడా తెలుసుకుందాం.

Also Read: Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు మరో బహుమతి.. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఏమిచ్చాడో తెలుసా..?

సాధారణంగా చట్టసభలకు ఎన్నికైన వారికి నెలవారి వేతనం ఇస్తారు. దీంతోపాటు వాహనం, నివాస గృహం, ఇతర ఖర్చులకు కొంత వ్యయం వెచ్చిస్తారు. ఏ లోక్‌సభ సభ్యులకైనా రూ.లక్ష వేతనం నెలకు చెల్లిస్తారు. ఇక పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రూ.2 వేల చొప్పున భోజనం, వసతి, ఇతర ఖర్చుల కోసం చెల్లిస్తారు. అంతేకాకుండా తన లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన భత్యం రూ.70 వేలు కంగనా పొందుతున్నారు. ఇక కార్యాలయ ఖర్చుల కోసం రూ.60 వేలు చెల్లిస్తారు.

Also Read: BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?

 

మండీ నుంచి గెలుపు
తన స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ నుంచి కంగనా గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను 74,755 ఓట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఈశాన్య రాష్ట్రాల్లో కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీకి పెద్ద దిక్కుగా మారారు. కాగా సినిమాల విషయానికి వస్తే చేతిలో కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. ఎంపీగా గెలవడంతో ఆ సినిమాలకు కొంత బ్రేక్‌ పడే అవకాశం ఉంది. తన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న కంగనా జాతీయ స్థాయి ఉత్తమ నటిగా నాలుగు సార్లు అవార్డును అందుకున్నది. అయితే ఇటీవల ఓ ఎయిర్‌పోర్టులో కానిస్టేబుల్‌ కంగనాను చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో ఆమెకు బుద్ధి చెప్పేలా దాడి చేసినట్లు కానిస్టేబుల్‌ చెప్పడం సర్వత్రా ఆకట్టుకుంది. చాలా మంది కానిస్టేబుల్‌కు అండగా నిలిచారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News