Viral News: బంగాళదుంపల పొలంలో బంగారం పండింది.. దాని విలువెంతో తెలుసా?
Viral News: బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బంగాళదుంపలు పండించే పొలంలో ఏకంగా బంగారం బయటపడింది. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, అధికారులు పురావస్తు శాస్త్రవేత్తలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Viral News: బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో అద్భుతం జరిగింది. ఓ రైతు పండిస్తున్న బంగాళదుంపల పంటలో ఏకంగా బంగారం పండింది. పంటపొలంలో బంగారం పండడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే! బంగాళదుంపలు పండిస్తున్న ఓ పొలంలో దుంపలను వెలికి తీస్తుంటే బంగారు నాణాలు బయటపడ్డాయి.
ఏం జరిగిందంటే?
బిహార్ రాష్ట్రం బక్సర్ జిల్లా సోన్‌బర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్ధర్ బరావ్ గ్రామంలో బంగాళదుంపలు పండించే పొలంలో బంగారు నాణాలు బయటపడ్డాయి. బంగాళ దుంపలను వెలికి తీస్తున్న క్రమంలో తొలుత ఓ నాణం పనిచేసే మహిళ కంటపడింది. అయితే ఆ తర్వాత వెంటనే మరికొద్ది లోతుకు వెళ్లగా మరో రెండు బంగారు నాణేలు కనిపించాయి. దీంతో ఆమె యజమానికి కబురు పంపింది.
పొలంలో బంగారు నాణాలు బయటపడ్డాయనే వార్త విన్న గ్రామస్తులు హుటాహుటిన సంబంధిత పొలానికి చేరుకున్నారు. అదే సమయంలో సమాచారాన్ని తెలుసుకున్న పురావస్తు అధికారులు పొలం వద్దకు చేరుకొని.. బంగారు నాణేలను సేకరించారు.
ఒక్కో నాణెం విలువ రూ. 27 వేలు!
విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సదరు బంగాళదుంపల పొలానికి వెళ్లి బయటపడిన మూడు బంగారు నాణేలను సేకరించారు. అయితే దొరికిన ఒక్కో నాణెం విలువ రూ. 27 వేల వరకు ఉండొచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో పొలం మొత్తం బంగారు నాణేలు కోసం పోలీసులు, పురావస్తు అధికారులు గాలింపు చేపట్టారు. ఈ బంగారు నాణేలు ఎక్కడ నుంచి వచ్చాయి? గుప్త నిధి ఏమైనా బయటపడిందా? అనే విషయాలను రాబడుతున్నారు.
Also Read: Live in Relationship Certificate: 28 ఏళ్ల యువకుడితో 67 ఏళ్ల మహిళ ప్రేమాయణం.. సహజీవనం కోసం నోటరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్