Live in Relationship Certificate: ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఏదో సినిమాలోని డైలాగ్. దీన్ని ప్రేరణగా తీసుకున్న ఓ జంట వయసుతో సంబంధం లేకుండా కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఈ జంటలో 67 మహిళ, 28 యువకుడు ప్రేమించుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి జీవించేందుకు కోర్టును ఆశ్రయించారు.
39 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ..
రాంఖాళీ అనే 67 మహిళ.. భోలు అనే 28 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గ్వాలియర్ కోర్టును ఆశ్రయించారు. వారిద్దరూ కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి కోరుతూ నోటరీకి అప్లే చేశారు. అయితే వీరిద్దరూ కలిసి ఆరేళ్లుగా లివ్ - ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వీరి ఇంకా కలిసే ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల వారు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ పని చేసినట్లు వారు అన్నారు.
దీంతో ఈ జంట మొరెనా జిల్లాలోని కైలారస్ నివాసి అనే అడ్వకేట్ దిలీప్ అవస్తీని కలిసి నోటరీ కోసం విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ అడ్వకేట్ గ్వాలియన్ జిల్లా కోర్టులో లివ్ - ఇన్ రిలేషన్ కోసం కావాల్సిన పత్రాలను కోర్టుకు సమర్పించాడు.
ఆ తర్వాత దాని కోసం నోటరీకి తయారు చేసి.. ఆ జంటకు అందించారు. అయితే చట్టపరంగా ఈ పత్రానికి ఎలాంటి చెల్లుబాటు లేదు. ఈ ప్రక్రియను ఇస్లాం మతంలో మాత్రమే పాటిస్తారు. హిందూ వివాహ ఒప్పందం ప్రకారం ఈ నోటరీ చెల్లదు. కలిసి జీవించేందుకు కోర్టుకు వచ్చిన ఈ జంట ఇలా వార్తల్లో నిలిచారు.
Also Read: Stalin Accident Scheme: రోడ్ యాక్సిడెంట్ బాధితులకు సహాయం చేస్తే రూ.5 వేల బహుమానం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్