Viral News: సాదాసీదాగా చేతిపంపు వద్ద స్నానం చేస్తున్న మంత్రి.. వీడియో వైరల్!
Viral News: సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు లేదా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల వద్దకు వస్తారు. కానీ, అందరూ నేతలు అలానే ఉండరు. రాజకీయ నాయకుల్లో కొందరు నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఈ మంత్రి కూడా వస్తారు. ఆ మంత్రి సాదాసీదాగా ఉండడమే కాకుండా ఆరుబయట నీటిపంపు వద్ద కూర్చొని స్నానం చేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు.
Viral News: ఎన్నికల ముందు ఎంతో మంది రాజకీయ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం అందరికి తెలిసిందే. అలా ప్రచారం చేసే క్రమంలో చాలా మంది ప్రజల మెప్పు కోసం రోడ్లపై చెత్తను ఎత్తేయడం, శ్రమదానం చేయడం వంటి పనులు చేస్తుంటారు. కానీ, ఎన్నికలతో సంబంధం లేకుండా.. ఓ మంత్రి సాదాసీదాగా ఉంటున్నాడు.
ఓ దళితుని ఇంటి బయట ఉన్న నీటి పంపు దగ్గర స్నానం చేయడం.. నేలపై కూర్చోవడం, మాములు మంచంపై పడుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. అయితే అది ప్రచారం కోసమైతే కాదు. కేవలం ఆయన రోజువారీ జీవితం మాదిరిగానే అతను జీవిస్తున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.
ఎవరా మంత్రి?
ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ అలియాస్ నందికి సంబంధించిన కొన్ని పిక్స్.. ఇప్పుడు వైరల్ గా మారాయి. నంద గోపాల్ ఉత్తరప్రదేశ్ కు పారిశ్రామిక అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ చిత్రాల్లో అతడు ఓ చేతి పంపు దగ్గర దేశీ స్టైల్ లో స్నానం చేస్తున్నాడు. అతని ప్రైవేట్ ట్విట్టర్ ఖాతాలో ఆయనకు సంబంధించిన పిక్స్ పోస్ట్ చేశారు.
ప్రజలతో మమేకం అయ్యేందుకే..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సూచనల మేరకు కేబినేట్ మంత్రులు అందరూ.. తమ పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు జిల్లాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని బరేలి గ్రామానికి చేరుకున్నారు. అలా అక్కడికి వెళ్లిన మంత్రి నంద గోపాల్.. ఆ గ్రామస్తులతో చర్చించి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఓ దళితుడి ఇంట్లో విశ్రాంతి తీసుకున్న మంత్రి నంది ఆ తర్వాత నీటి పంపు వద్ద స్నానం చేశారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఎంతోమంది మంత్రి నందిని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: India Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మరణాలు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.