Bride's Brothers made their Sister's entry special: మన దేశంలో పెళ్లి వేడుకలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అంగరంగ వైభవంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయాలను కూడా పాటిస్తుంటారు. సాధారణంగా వధువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పెళ్లి మండపానికి తీసుకొస్తారు. కొన్ని ప్రాంతాల్లో మేనమామ.. మరికిన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేదా సోదరులు (Bride's Brothers) కూడా వధువు (Bride)ను మండపానికి తీసుకొస్తారు. తాజాగా తమ సోదరిని మండపానికి తీసుకెళ్లే క్రమంలో సోదరులు చేసిన పని అందరి గుండెలను పిండేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఓ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకలో తమ సోదరిపై ఉన్న ప్రేమను తెలిపేందుకు సోదరులు వినూత్న ప్రయత్నం చేశారు. వధువు మండపానికి తీసుకు వెళ్లే మార్గంను మొత్తం పూలతో నింపారు. ఆమె సోదరులు దారి పొడవునా మోకాళ్లపై కూర్చుని.. తమ అర చేతులను పూల మార్గంపై ఉంచారు. ఆ వధువు సోదరుల అర చేతుల మీద నడుస్తూ మండపానికి చేరుకుంది. వధువు చేతుల మీద నడుస్తుండగా పక్కన వారు పూలు, డబ్బుల వర్షం కురిపించారు. ఆ సమయంలో వధువు చాలా సంతోషపడుతూ మండపానికి చేరుకుంది. 



సోదరిని మండపానికి తీసుకెళ్లే క్రమంలో సోదరులు చేసిన వినూత్న ప్రయోగంను 'విట్టీ వెడ్డింగ్' అనే యూసర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ప్రియమైన సోదరి' అని కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోకు ఇప్పటికే వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చుసిన వారు 'సోదరులు గుండెలు పిండేస్తున్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అదృష్టవంతురాలు', 'లక్కీ లేడీ' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 



Also Read: Ketika Sharma Pics: ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతిపోగోడుతోన్న కేతిక శర్మ!!


Also Read: F3 Movie Release Date: కొద్దిగా ముందో వెనకో.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా! నవ్వుల జర్నీకి సిద్ధంకండి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook