F3 Movie Release Date: కొద్దిగా ముందో వెనకో.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా! నవ్వుల జర్నీకి సిద్ధంకండి!!

వెంకటేష్, వరుణ్ తేజ్ కో బ్రోలుగా నటించిన ఎఫ్‌ 3 సినిమాలో ఒక్క పాట మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.  తమన్నా, మెహరీన్‌ అందాలకు ఈసారి సోనాల్ చౌహాన్ కూడా తోడవ్వనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 09:08 AM IST
  • వేసవి కానుకగా ఏప్రిల్ 28న ఎఫ్ 3 విడుదల
  • కొద్దిగా ముందో వెనకో.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా
  • నవ్వుల జర్నీకి సిద్ధంకండి
F3 Movie Release Date: కొద్దిగా ముందో వెనకో.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా! నవ్వుల జర్నీకి సిద్ధంకండి!!

F3 Movie Shooting is Completed: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) కో బ్రోలుగా నటించిన 'ఎఫ్ 2' సినిమా ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ కామెడీ.. తమన్నా, మెహరీన్‌ల అందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఎఫ్ 2కి మూడు రెట్ల వినోదాన్ని అందించేందుకు సీక్వెల్‌ ఎఫ్‌ 3 (F3 Movie) రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎఫ్‌ 3 వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.

ఎఫ్‌ 3 సినిమాలో ఒక్క పాట మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ఖాతాలో చిత్ర బృందం ఓ చిన్న వీడియో వదిలింది. అందులో సినిమాలో నటించిన వారందరూ సందడి చేశారు. 'మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది. వస్తే, కొద్దిగా ముందుగా. వెళ్లినా కొద్దిగా వెనకగా!. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా' అంటూ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది.

'వినోదం, గ్లామర్‌, యాక్షన్.. ఇలా అన్ని రకాల వాణిజ్య హంగులతో ఎఫ్‌ 3 చిత్రం నిర్మిస్తున్నాం. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలి ఉన్న ఒక్క పాటను త్వరలోనే చిత్రీకరిస్తాం' అని నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ పేర్కొన్నారు. మొత్తానికి ఎఫ్ 2కి మించిన వినోదం ఇందులో ఉండబోతోందని నిర్మాతలు అంటున్నారు. వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహరీన్‌లు మరోసారి  అభిమానులను అలరించనున్నారు. 

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ సునీల్ (Sunil) వంటి వారితో ఎఫ్‌ 3 సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. ఇక తమన్నా, మెహరీన్‌ అందాలకు ఈసారి సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కూడా తోడవ్వనుంది. అభిమానులకు అందాల విందు ఉండనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

Also Read: IND vs WI: స్టార్ ఆటగాళ్లకు చోటు.. టీ20ల్లో టీమిండియాతో తలపడే వెస్టిండీస్‌ జట్టు ఇదే!!

Also Read: Earthquake in Cricket: మ్యాచ్ జరుగుతుండగా..భూకంపం, మరి ఆటగాళ్లకు ఏమైందప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News