Viral Video of Cops Saves Drowning Man: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కొన్నిచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్ల పైకి నీళ్లు వస్తున్నాయి. పుణేలోని ఓ వాగుకు భారీగా వరద నీరు చేరగా.. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి అందులో పడిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే ఇద్దరు పోలీసులు ఆ వరద ప్రవాహంలోకి దూకి నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించారు. మొదట ఒకరే ఆ వరద నీటిలో దిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయగా.. వరద ఉధృతికి అది సాధ్యపడలేదు. అతన్ని కాపాడే ప్రయత్నంలో పోలీస్ అధికారి కూడా నీళ్లలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో పోలీస్ అధికారి వెంటనే వరద నీటిలోకి దిగి.. వాళ్లను చేరుకున్నాడు. ఎట్టకేలకు ఇద్దరు పోలీసులు కలిసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.  పుణేలోని బగుల్ ఉద్యాన్ సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని దత్తవాడి పోలీస్ స్టేషన్‌కి చెందిన సద్దాం షేక్,  అజిత్ పోకరే అనే ఇద్దరు కానిస్టేబుళ్లు  కాపాడారు. ప్రాణాలకు తెగించి మరీ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని రక్షించడం నిజంగా ప్రశంసనీయం. మహారాష్ట్ర పోలీసులను చూసి గర్వపడుతున్నాం.' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



Also Read: Hyper aadi- Ram Prasad: ఆర్పీ చెప్పినవన్నీ అబద్దాలే.. హైపర్ ఆది, రామ్ ప్రసాద్


Also Read: Pawan Kalyan: అధికార మదంతో అలా చేస్తే తాటా తీస్తా..వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook