Hyper aadi- Ram Prasad Counter to Kiraak RP: సూపర్ హిట్ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ నుంచి ఇప్పుడు ఎక్కువమంది బయటకు వచ్చేస్తున్నారు. ఇతర ఆఫర్లు వస్తున్నాయో లేక జబర్దస్త్ లో ఇమడ లేక బయటకు వెళ్తున్నారో తెలియదు కానీ నాగబాబు మొదలుకుని తర్వాత అనేక మంది కమెడియన్లు బయటకు వెళ్లారు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా బయటకు వెళ్లి వేరే ఇతర కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి మల్లెమాల సంస్థ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. జబర్దస్త్ నిర్వాహకులు కేవలం వ్యాపారం చేస్తున్నారని మనుషులు ఏమైపోయినా వాళ్లకు అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కేవలం నాగబాబు అనే వ్యక్తి వల్లే చాలా కాలం పాటు జబర్దస్త్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిందని ఆయన కామెంట్స్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జబర్దస్త్ కి డేమేజ్ అవుతున్న నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసమే అన్నట్టుగా హైపర్ ఆది జబర్దస్త్, రాంప్రసాద్ రంగంలోకి దిగారు. ఆర్పీ మాట్లాడిన మాటల్లో నిజాలు లేవంటూ వీరిద్దరూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. హైపర్ ఆది మాట్లాడుతూ అసలు శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి వ్యక్తి గురించి ఆర్పీ మాట్లాడడానికి అసలు ఏమీ హక్కు ఉంది అన్నట్టు మాట్లాడారు. ఆయన ఎమ్మెస్ రెడ్డి గారి కుమారుడు, ఒకప్పటి సీఎం అల్లుడు ఆయనలాంటి వ్యక్తి గురించి ఏక వచనాలతో మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.
ఆర్పీ కూడా తమలాంటి వ్యక్తేనని అంటూనే ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని అన్నారు. ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఉండి బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు వేరే చోట అవకాశాలు వచ్చాయి కదా అని అక్కడికి వెళ్లి ఇక్కడ గురించి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. రాంప్రసాద్ అయితే గతంలో ఒక స్కిట్లో ఆర్పీ తన తల్లి చనిపోయినప్పుడు జబర్దస్త్ తనకు అండగా ఉందంటూ చేసిన కామెంట్లు వీడియోని కూడా ప్లే చేసి చూపించి అలాంటి వ్యక్తి ఇప్పుడు అక్కడికి వెళ్లి ఎలా మాట్లాడుతున్నాడో చూడాలని అన్నారు. హైపర్ ఆది కూడా అభి అన్న తర్వాత ఆర్పీ అన్న కూడా నాకు చాలా దగ్గర వ్యక్తి అయినా సరే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని అన్నారు.
ఒకవేళ ఆయనే కనక తన వీడియో చూసుకుంటే తాను ఎక్కడి నుంచి వచ్చాను? తనను జబర్దస్త్ లోపలికి ఎవరు రానిచ్చారు? మొదటి స్కిట్ చేసినప్పుడు మనం తిన్న భోజనం ఎలా ఉంది అనే విషయం కనుక గుర్తు తెచ్చుకుంటే ఇలా మాట్లాడి ఉండడని అన్నాడు. సాధారణంగా మనం ఇంట్లో పది రకాలు వంటలు చేస్తేనే ఒకటో రెండో వంటలు సరిగ్గా కుదరవు అలాంటిది అక్కడ వంటల గురించి కూడా ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆది పేర్కొన్నారు.
అంతేకాక ఈ ఇంటర్వ్యూకి జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి నేను చెప్పేదంతా కరెక్ట్ కాదు ఆర్పీ అబద్ధాలు చెబుతున్నాడు అని అంటే గుండు కొట్టించుకుంటానని ఆర్పీ శపథం చేసిన నేపథ్యంలో వాడు మా వాడే కాబట్టి అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చామంటూ రాంప్రసాద్ కామెంట్స్ చేశారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి
Also Read: Ananya Nagalla: వెకేషన్లో రచ్చ రేపిన అనన్య.. థైస్ అందాలతో హాట్ ట్రీట్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook