Viral Video of UP Man thrashes by Police: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని (Kanpur) దెహత్ అక్బర్‌పూర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం (డిసెంబర్ 10) లాఠీచార్జి జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఇన్‌స్పెక్టర్ మిశ్రా ఓ వ్యక్తిని విచక్షణారహితంగా లాఠీతో చితకబాదాడు. అతని చేతిలో ఉన్న చిన్నపిల్లాడు ఏడుస్తున్నప్పటికీ ఆ పోలీస్ అదేమీ పట్టించుకోలేదు. ఒకానొక దశలో ఆ పిల్లవాడిని తండ్రి నుంచి బలవంతంగా లాగేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్బర్‌పూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన కొద్దిరోజులుగా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఆసుపత్రి వార్డుల్లోకి దుమ్ము, ధూళి వచ్చి చేరుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉద్యోగులంతా నిరసనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిపై లాఠీచార్జి (Lathicharge) జరిపారు.


ఈ సందర్భంగా చేతిలో కొడుకుని ఎత్తుకుని ఉన్న ఓ వ్యక్తిని ఇన్‌స్పెక్టర్ మిశ్రా లాఠీతో విపరీతంగా (Police thrashes Man) చితకబాదాడు. లాఠీ దెబ్బలు ఎక్కడ తన కొడుక్కి తగులుతాయోనని అతను తల్లడిపోయాడు. అదే విషయాన్ని పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. పైగా అతని చేతిలో ఉన్న బాబును బలవంతంగా లాగేసే ప్రయత్నం చేశారు. ఆ పిల్లవాడు ఏడుస్తున్న పట్టించుకోకుండా నిర్దయగా వ్యవహరించారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సబ్ ఇన్‌స్పెక్టర్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తింది. మొదట పోలీసులు తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ... ఆ తర్వాత మిశ్రాను సస్పెండ్ చేయక తప్పలేదు. సున్నితంగా డీల్ చేయాల్సిన ఇష్యూ పట్ల పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని యూపీ పోలీస్ (Uttar Pradesh) ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పౌరుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని పదేపదే ఆదేశాలిచ్చినప్పటికీ కాన్పూర్ పోలీసులు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.  అంతకుముందు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు. 'బలహీనులకు న్యాయం జరిగేలా పటిష్టమైన శాంతిభద్రతలు అవసరం. బలమైన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చట్టం పట్ల భయాన్ని కలిగించాలి. అంతేకానీ పోలీసుల పట్ల కాదు.' అని అభిప్రాయపడ్డారు.


 



Also Read: Scary Video: భయానికే భయం పుట్టించే వీడియో.. 20 అడుగుల పాము చిన్న పాప వైపు.. ఏం జరిగింది..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


Android Link - https://bit.ly/3hDyh4G