72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

Man Arrested For Raping 72-year-old Woman In Agra: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అత్యాచార ఘటన వెలుగుచూసింది. 72 ఏళ్ల వృద్ధురాలిపై (Agra Rape Victim) ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. పని ఇప్పిస్తానని ఆ వృద్ధురాలికి ఆశ చూపి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 02:01 PM IST
    • ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం
    • 72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
    • నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

Man Arrested For Raping 72-year-old Woman In Agra: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ అవమానీయ ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వృద్ధురాలిపై (Agra Rape Victim) అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. దీనికి కారణమైన నిందితుడు వికాస్ శర్మ అనే 52 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  

జగదీశ్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 72 ఏళ్ల మహిళ నవంబర్ 14 సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బోడ్లా అనే ఊరికి వెళ్లింది. అయితే ఆమెను ఓ వ్యక్తి.. పని ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. నిందితుడ్ని మాటలు నమ్మిన వృద్ధురాలు అతనితో పాటు వెళ్లిందని అని పోలీసులు తెలిపారు. అయితే 'తనను ఓ ఇంట్లో బందీగా చేసి అత్యాచారానికి పాల్పడ్డినట్లు ఆమె వాపోయింద'ని వివరించారు.

అక్కడి నుంచి తప్పించుకున్న వృద్ధురాలు.. సోమవారం (నవంబరు 15) తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని విచారిస్తామని తెలిపారు.

Also Read: Suriya Jai Bhim: హీరో సూర్యపై దాడి చేస్తే రూ.1లక్ష... పీఎంకె నేత సంచలన ప్రకటన

Also Read: Madras HC: మద్రాస్ హై కోర్టు కీలక నిర్ణయం- ఇకపై బ్రెయిలీ లిపిలోనూ తీర్పు కాపీలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News