Woman wears Mehndi blouse: సాధారణంగా పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతరత్రా శుభకార్యాల్లో... ఆడవాళ్లు తమ చేతులు, పాదాలను రకరకాల మెహందీ డిజైన్లతో (Mehndi design) అలంకరించుకోవడం చూస్తుంటాం. కానీ ఓ మహిళ ఏకంగా 'మెహందీ బ్లౌజ్' (Mehndi blouse) ధరించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జాకెట్‌కు బదులు ఆ మహిళ తన ఎద, వీపు భాగాన్ని పూర్తిగా మెహందీ డిజైన్‌తో నింపేసింది. ఒకరకంగా ఇదీ బాడీ పెయింటింగ్ (Body painting) లాంటిదే అని చెప్పాలేమో. ప్రస్తుతం ఆ మహిళ మెహందీ బ్లౌజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారగా... ఆమె ఛాయిస్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

thanos_jatt అనే ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్ తన ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. నిజానికి ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ చూడకపోతే... అది నిజమైన జాకెటే అని పొరపడే అవకాశం లేకపోలేదు. 'హెన్నా బ్లౌజ్... వాట్స్ నెక్స్ట్' అనే క్యాప్షన్‌తో దాన్ని పోస్ట్ చేశారు. ఆ మహిళ ఎవరో ఏంటో వివరాలు తెలియదు కానీ.. తెల్లచీరపై మెహందీ బ్లౌజ్ ధరించి (Woman wears henna blouse) వయ్యారంగా నడవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. 


జాకెట్‌కు బదులు ఇలా మెహందీ డిజైన్ వేసుకోవాలనే ఐడియా ఎందుకు వచ్చిందో కానీ.. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. టైలర్ ఖర్చులు మిగిలించుకునేందుకే ఆమె ఇలా మెహందీ బ్లౌజ్ అని ధరించిందని ఓ లేడీ నెటిజన్ సెటైర్స్ వేసింది. ఫ్యాషన్ పేరుతో ఇదేం పిచ్చి పని అంటూ మరో నెటిజన్ చివాట్లు పెట్టాడు. కొంతమంది నెటిజన్లు చెప్పలేని భాషలో ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఆరు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు (Viral Video) ఇప్పటివరకూ 2002 లైక్స్ వచ్చాయి. 


 



Also Read: Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. ముగ్గురు మహిళలపై కర్రలతో దాడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook