Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. ముగ్గురు మహిళలపై కర్రలతో దాడి

Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మహిళలపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గుంపుగా వచ్చి ముగ్గురు మహిళలపై దాడి చేశారు. కాళ్లతో తన్నడం, కర్రలతో దారుణంగా కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 04:37 PM IST
Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. ముగ్గురు మహిళలపై కర్రలతో దాడి

Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి వేళ ఘోర సంఘటన జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తుల గుంపు వచ్చి ముగ్గురు మహిళలపై దాడి చేసింది. మహిళలను కొట్టడం, తన్నడం, కర్రలతో దారుణంగా కొట్టారు. అలాంటి అవమానకరమైన, భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో అప్పుడే కారు వచ్చింది. ఆ కారును పార్క చేసిన తర్వాత అందులో నుంచి తొలుత ఇద్దరు యువతులు బయటకు వచ్చారు. వారిని గమనించిన మరో ఇద్దరు మహిళలు వారి దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగారు.

అంతలోనే వారికి సంబంధించిన కొందరు పురుషులు కర్రలతో వచ్చి వారిపై దాడికి దిగారు. ఆ తర్వాత కారులో నుంచి దిగిన మరో మహిళనూ అత్యంత పాశవీకంగా ఇద్దరు పురుషులు దారుణంగా కొట్టారు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ సంఘటన నవంబరు 19న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. 

అయితే ఆ ముగ్గురు మహిళలపై దాడికి పాల్పడిన వ్యక్తులు.. వారికి పరిచయస్తులేనని పోలీసుల విచారణ తేలింది. ఇరు వర్గాల మధ్య ఏదో మనస్పర్థల కారణంగా గొడవలు పడినట్లు తెలిసిందని పోలీసులు అన్నారు. బాధితురాళ్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికీ ఎవరినీ పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.

Also Read: Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!

Also Read: Karnataka High Court: కేసు విచారణ జరుగుతుండగా-లైవ్‌లోనే స్నానం చేసిన వ్యక్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News