Visakha Agency: మన్యంలో ఎదురుకాల్పులు...భయంతో గిరిజనం
విశాఖ మన్యం ( Visakha Agency ) లో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టు కదలికల నేపధ్యంలో పోలీసుల నిఘా తీవ్రమైంది. వరుస ఎదురుకాల్పుల సంఘటనలతో గిరిజనం బిక్కుబిక్కుమంటోంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం.
విశాఖ మన్యం ( Visakha Agency ) లో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టు కదలికల నేపధ్యంలో పోలీసుల నిఘా తీవ్రమైంది. వరుస ఎదురుకాల్పుల సంఘటనలతో గిరిజనం బిక్కుబిక్కుమంటోంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం.
మావోయిస్టు అగ్రనేతలు ( Maoist leaders ) అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునివ్వడంతో మన్యంలో టెన్షన్ ( Tension in Agency ) నెలకొంది. వారోత్సవాల్ని అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నించడంతో కేవలం పది రోజుల్లో మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి. దాంతో విశాఖ మన్యంలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం అందడంతో ఆంధ్ర, ఒడిశా పోలీసులు మన్యం అంతా జల్లెడ పడుతున్నారు. భారీగా కూంబింగ్ ( Combing ) కొనసాగుతోంది. వరుస ఎదురుకాల్పులతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Also read: GATE 2021 exams: గేట్ 2021 ఎగ్జామ్స్ షెడ్యూల్, అర్హతల సడలింపు వివరాలు
జూలై 16న మల్కన్ గిరి జిల్లా జోడం పంచాయితీ పరిధిలోని ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా సరిహద్దు ( Odissa Border ) నుంచి ఆంధ్రలోకి ప్రవేశించరాని తెలియడంతో ఆంధ్ర పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దాంతో 19వ తేదీన పెదబయు మండల పరిధిలో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈసారి మావోయిస్టు అగ్రనేతలు గాయాపడినట్టు తెలుస్తోంది. ఇటీవల ఒడిశా రాళ్లగెడ్డ పంచాయితీ పరిధిలో ఇంకోసారి ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు దయ మృతి చెందాడు.
అమరవీరుల వారోత్సవాల్ని ప్రతియేటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకూ నిర్వహిస్తుంటారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదనే ఆలోచనతో ఇటు ఆంధ్ర, అటు ఒడిశా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఇరువురి మధ్యలో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. Also read: Jammu Kashmir: ఎన్నికల్లో ఇక పోటీ చేయను