చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు రాసిన  'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్'  పుస్తక ఆవిష్కరణ  కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా... వెంక్యయ రచించిన పుస్తక ఆవిష్కరణ చేశారు. కేంద్ర సమాచారం శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకయ్యానాయుడు రచించిన 'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్' పుస్తకంగా ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ చాలా క్లుప్తంగా వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో వెంకయ్యనాయుడు నిర్వహించిన 330 ప్రజా కార్యక్రమాల వివరాలను కూడా పుస్తకంలో పొందుపరిచారు. పుస్తకంతో వెంకయ్యనాయడిలోని రచన సామర్థ్యం ఏపాటిదో తెలియజేస్తోంది.


పుస్కకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎంతో మేథా సంపత్తి కల్గిన వెంకయ్యనాయుడు  తన అనుభవాలను పుస్తక రూపం ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు.  'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్' పుస్తకం యువతకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ పుస్తకం యువతకు మార్గ నిర్దేశనం చేస్తుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.