Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!
Attack on CM Nitish: బిహార్ ముఖ్యమంత్రిపై ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. సెక్యురిటీని దాడుకుని వచ్చి దాడి చేయబోయినట్లు తెలిసింది. వీవీఐపీల భద్రత విషయంలోనే ఇలాంటి లోపాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Attack on CM Nitish: మరోసారి వీవీఐపీల భద్రతలో లోపం బయటడింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆ యువకుడి దాడితే అప్రమత్తమైన.. సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఏమైదంటే..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. పట్నా జిల్లా బక్తియాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న.. ఆయనపై ఓ వ్యక్తి సెక్యురిటీని దాడుకుని వచ్చి.. నితీశ్ కుమార్‌పై దాడి చేయబోయాడు. ఆయనపై చేయివేసి.. పక్కకు లాగబోయాడు. అయితే వెంటనే సెక్యురిటీ ఆ వ్యక్తిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆ వ్యక్తిని స్థానిక పోలిస్ స్టేషన్‌కు తరలిచి.. విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? అందులో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
అయితే సీఎం నితీశ్ కుమార్‌పై దాడికి సంబంధించిన వీడియోను.. రాజకీయ విశ్లేషకులు తెహసీన్ పూనావాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది క్షమించరాని భద్రతా లోపం అని రాసుకొచ్చారు. సీఎం వ్యక్తిగత భద్రత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ విషయంపై విచారణ జరపాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇక వీవీఐపీల భద్రతలో లోపం తలెత్తడే ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీని పంజాబ్‌లో కొంతమంది నిరసనకారులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఇక అదే పంజాబ్‌లో రాహుల్ గాంధీపై జెండా విసిరిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో వరుసగా వీవీఐపీల భద్రతలో లోపాలు బయటపడుతుండటం పట్ల.. ఆదోళన వ్యక్తమవుతోంది.
Also read: Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్
Also read: PMGKAY extended: ప్రధాన మంత్రి అన్న యోజన పథకం గడువు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook