మాజీ ప్రధాని వాజ్‌పేయికి, ప్రస్తుత ప్రధాని మోదీ మధ్య ప్రత్యేక అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరూ బీజేపీ కార్యకర్తలుగానే కెరీర్‌ను మొదలుపెట్టి.. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ కూడా తన అనేక ప్రసంగాల్లో వాజ్‌పేయి మాటలను గుర్తుచేసుకొనేవారు. మోదీ.. వాజ్‌పేయిని గురువుగా, మార్గదర్శకుడిగా భావిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఓసారి వాజ్‌పేయి భారీ జనసందోహం మధ్యలో బీజేపీ కార్యాలయానికి రాగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న మోదీ.. సంతోషంగా ప‌రుగెత్తుకెళ్లి వాజ్‌పేయిని ఆప్యాయంగా హత్తుకుంటారు. వాజ్‌పేయి కూడా ఆయన్ను దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటారు. ఆ ఘటనకు సంబంధించిన  ఓ అరుదైన వీడియో ఇప్పుడు  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత వాజ్‌పేయి.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి 'ప్రభుత్వ ధర్మం'పై బోధించారు. ప్రస్తుతం వాజ్‌పేయి.. ఆరోగ్యం క్షీణించింది. ఆయన లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో విడుదలైంది. ఆ వీడియో మీకోసం...