152 ఏళ్ల తర్వాత జరుగుతున్న అద్భుతం అని ప్రపంచం కళ్లప్పగించిన చూసిన చంద్రగ్రహణం సమయంలోనే అంతరిక్షంలో మరో అద్భుతం చోటుచేసుకుందా ? జనవరి 31న చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ఆకాశంలోకి గ్రహాంతర వాసులు కనిపించారా ? సూపర్ మూన్‌ను చూసే క్రమంలో యూఎఫ్‌వో హంటర్ల కంటపడిన ఓ దృశ్యం ఇలాంటి అనుమానాలకే తావిచ్చింది. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి పక్క నుంచే మెరుపు వేగంతో మెరుస్తూ దూసుకెళ్లినట్టుగా కనిపించిన ఓ అంతుచిక్కని వస్తువు అనేక అనుమానాలకు తావిస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


యూట్యూబ్‌లో యూఎఫ్‌ఓ మేనియా అనే ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారిలో కొంతమంది అది ఏలియన్స్ ప్రయాణించిన వాహనమే అయ్యుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చగా... ఇంకొంత మంది మాత్రం ఏలియన్స్ వచ్చారనే వార్తను కొట్టిపారేశారు. చంద్రుడి పక్కనుంచి వెళ్లిన వాహనం ఏదైనా బోయింగ్ విమానమైనా అయి వుంటుంది లేదా వెదర్ బెలూన్ అయ్యుంటుందని ఈ ప్రచారాన్ని కొట్టిపారేసే శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే, మానవమాత్రుడు రూపొందిన ఏ అంతరిక్ష వాహనం అంత వేగంతో వెళ్లడానికి సాధ్యపడదు అనే వాదనలు వినిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలావుంటే, గ్రహాంతరవాసులు వున్నారనే విషయం నాసాకు తెలిసి కూడా ఆ విషయాన్ని ఏమీ తెలియనట్టు తొక్కిపెడుతోందని గ్రహాంతరవాసుల కోసం వేట సాగిస్తున్న వాళ్లు అభిప్రాయపడుతున్నారు.