New Delhi: యమునా నది(yamuna river)లో అమోనియా (Ammonia) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా స్తంభించింది. వాజిరాబాద్(Wazirabad) ప్రాంతంలోని యుమునా నదిలో అమోనియా స్థాయి 3పీపీఎమ్​ (పార్ట్స్​ పర్ మిలియన్​) ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఈ ప్రభావం పడినట్లు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్యానా(haryana) నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని దిల్లీ నీటి సరఫరా బోర్డ్ వైస్ ఛైర్మన్​ రాఘవ్ చద్ధా తెలిపారు. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. పెరిగిన నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి (cause of water pollution in yamuna) ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హరియాణా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.


Also read: Chennai Floods: చెన్నైని ముంచెత్తనున్న వర్షాలు, వెంటాడుతున్న 2015 వరద భయం


"నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాను. తగిన సంఖ్యలో నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాము. యమునా నది నీటిలో అమోనియా స్థాయి పెరగడం వల్ల నీటి సరఫరా ప్రభావం పడింది"-రాఘవ్ చద్ధా, దిల్లీ వాటర్​ బోర్డ్ వైస్ ఛైర్మన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook