Dense fog effect: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగ మంచు.. న్యూ ఇయర్ వరకు ఇదే విధంగా..
cold intensity: ఉత్తర భారతాన్ని పొగమంచుతోపాటు చలిగాలులు కమ్మేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇ్బబంది పడుతున్నారు. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడుతున్నాయి.
Cold wave effect: దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కమ్మేస్తోంది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రెండు రోజులు కూడా ఇదే విధంగా పొగ మంచు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబరు 31 తర్వాత పొగ మంచు క్రమంగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. పొగ మంచు కారణంగా వాహనదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. దీని వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ పొగ మంచు దెబ్బకు నోయిడాలోని పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు అధికారులు.
ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చలి గాలులు వీస్తున్నాయి. వచ్చే జనవరి 4 వరకు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పడిపోయి అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువైంది. రానున్న ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి ప్రజలు గజగజలాడుతున్నారు. ఉదయం 9 గంటల దాటినా సరే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కుమ్రం భీం జిల్లాలోని సిర్పూర్‌లో అతి తక్కువగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మరో పక్క ఆదిలాబాద్ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter